Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. మూడు రోజులు వానలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert to Telugu States: భానుడి ప్రతాపంతో ఉక్కపోతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్లు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిని వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నైరుతి గాలుల ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని, ఏపీలో నేడు, రేపు, ఎల్లుండి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చేతికొచ్చిన పంట ఎక్కడ నేలరాలిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు.
Read Also: KOLORS Shocks: వెయిట్ లాస్ పేరుతో విద్యుత్ షాకులు.. నిర్లక్ష్యపు థెరపీతో ప్రాణాలకు ముప్పు
Also Read
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయని వివరించింది. ఇదిలా ఉండగా.. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు నేడు పెరిగే అవకాశం ఉందని.. రేపటి నుంచి 2 నుంచి 4 సెంటిగ్రేడ్ల తగ్గుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు భారీ అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర వాసులను శుక్రవారం వరుణుడు కనికరించాడు. పలు ప్రాంతాల్లో సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం కలిగింది. ఇదిలా ఉండగా.. జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులను ముంచేశాయి. ఇప్పటికే రైతులు వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తుండగా.. ఈ వర్షంగా కారణంగా ధాన్యం కుప్పలు తడిచిపోయాయి. చాలా మంది రైతులు ఇంకా వరికోతలు కోయలేదు. దీనివల్ల వారికి ఈ అకాల వర్షం ఆటంకం కలిగించింది.
తాజావార్తలు
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!