Norman Borlaug Award to Indian Scientist Dr. Swati nayak: భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రతి ఏడాది అందించే నార్మన్ బోర్లాగ్ అవార్డుకు ఎంపికయ్యారు స్వాతి. ఒడిశాకు చెందిన స్వాతి నాయక్ ప్రస్తుతం ఢిల్లీలోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఆర్‌ఆర్‌ఐ)లో శాస్త్రవేత్తగా ఉన్నారు. నార్మన్ ఇ బోర్లాగ్ అవార్డ్ ఫర్ ఫీల్డ్ రీసెర్చ్ అండ్ అప్లికేషన్ విభాగంలో స్వాతి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆమెను “అత్యుత్తమ యువ శాస్త్రవేత్తగా” పేర్కొంటూ ఈ అవార్డును అందించింది ఈ సంస్థ. స్వాతి నాయక్ న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఆర్‌ఆర్‌ఐ) లో విత్తన వ్యవస్థ, ఉత్పత్తి నిర్వహణకు దక్షిణాసియా లీడ్ గా పనిచేస్తున్నారు. వరిపంట సాగు చేస్తున్న చిన్న రైతులకు అందించిన సేవలకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది.
రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ ద్వారా అందించబడిన ఈ అవార్డు డిమాండ్-ఆధారిత వరి విత్తన వ్యవస్థలలో స్వాతి సన్నకారు రైతులకు సాయం అందించన సేవలకు గాను దక్కింది. ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ఎక్స్ (ట్విటర్) ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. నోబెల్ అవార్డు గ్రహీత, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ నార్మన్ బోర్లాగ్ జ్ఞాపకార్థం 40 ఏళ్లలోపు ఉన్న అసాధారణ శాస్త్రవేత్తలకు, ఆహారం, పోషకాహార భద్రత, ఆకలి నిర్మూలన రంగంలో పనిచేస్తున్న వారికి ఈ అవార్డు ఇవ్వబడుతుంది.
స్వాతి నాయక్ ఒడిశాకు చెందిన యువతి. ఈ అవార్డు పొందడంపై స్పందించిన స్వాతి మాట్లాడుతూ “ఈ క్షణం ఒక కొత్త ప్రారంభం. ఫీల్డ్ సైంటిస్ట్‌గా నా ప్రయత్నాలను, గొంతుకను, పనిని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం” అని అన్నారు. నాయక్ 500 కంటే ఎక్కువ వరి రకాల కోసం 10,000 కంటే ఎక్కువ విస్తృతమైన ఆన్-ఫార్మ్ పరీక్షలను నిర్వహించారు, ఆసియా మరియు ఆఫ్రికా అంతటా వివిధ దేశాల్లోని విభిన్న పర్యావరణ వ్యవస్థల్లో ఈ ట్రయల్స్‌ని చాలా సూక్ష్మంగా అమలు చేయడం కోసం వేలాది మంది చిన్న రైతులతో కలిసి పనిచేశారు.
Many congratulations to 🇮🇳 scientist Dr. Swati Nayak @nayak_swati for receiving the prestigious Norman Borlaug Field Award 2023 @WorldFoodPrize. Compliment her work using tech to bring tangible benefits to farmers, and promoting sustainable agriculture. https://t.co/zCRaGsWhOd
— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) September 21, 2023