మద్యం ఓ కుటుంబంలో విషాధాన్ని మిగిల్చింది.. తండ్రి మద్యం మత్తు అభం శుభం తెలియని ఆరు నెలల పసికందు ప్రాణాన్ని పోగొట్టింది.. మత్తులో ఉన్న తండ్రి తన 6 నెలల పసికందుపై పడుకోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ అమానుష ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటయ పాలెంలో వేమూలూరి గాంధీ, భార్య వ్యవసాయ కులీ పని చేసుకునేవారు. మద్యం తాగే అలవాటు ఉన్న గాంధీ రోజూ అలవాటులానే పని ముగించుకొని తాగి ఇంటికి వచ్చి సేదతీరేందుకు మంచంపై పడుకున్నాడు…
అయితే అదే మంచంపై నిద్ర పోతున్న తన కూతురు దివ్య(6 నెలలు)ను గమనించకుండా చిన్నారిపై పడుకోవడంతో.. పాప అపస్మారక స్థితికి చేరకుంది.తల్లి బిడ్డ నిద్రపోతుందనుకుంది.. ఆ తర్వాత పని ముగించుకొని బిడ్డ దగ్గరకు వచ్చింది.. బిడ్డలో కదలికలు లేకపోవడంతో వెంటనే బంధువులను తీసుకొని ఆసుపత్రికి వెళ్లింది.. కానీ మార్గమధ్యంలోనే ఆ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.. భర్త తాగుడు వల్లే తన బిడ్డ ప్రాణాలు పోయాయని గుండెలు బాదుకుంటూ కన్నీరు పెట్టుకుంది.. ఆమెను చూసిన గ్రామస్తులు, బంధువులు కన్నీరు పెట్టుకున్నారు.. తెలిసి చేసిన తెలియక చేసిన పసిబిడ్డ ప్రాణాలు పోయాయి.. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదఛాయాలు అలుముకున్నాయి..