Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాస్య నటుడు రాహుల్ రామకృష్ణ ఎప్పుడూ మాట్లాడిన ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా మాట్లాతుంటారు. ఇందులొ బాగంగా తాజాగా సినిమా ఇండస్ట్రీలో మారుతున్న పరిస్థితులు, ప్రేక్షకుల అభిరుచిపై ఆయన చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిత్ర పరిశ్రమలోని లోపాలను వేలెత్తి చూపుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
రాహుల్ రామకృష్ణ తన ట్వీట్లో ప్రధానంగా సినిమాల నాణ్యతపై దృష్టి పెట్టారు.. ‘థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయని బాధపడటం మానేసి, మనం ఎంత చెత్త సినిమాలు తీస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి’ అంటూ మేకర్స్‌కు చురకలు అంటించారు. నేటి కాలంలో ఒక సామాన్యుడు థియేటర్‌కు రావడం అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని.. ఎండలు, ట్రాఫిక్, పెట్రోల్ ధరలు, పార్కింగ్ సమస్యలు.. ఇవన్నీ దాటుకుని థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడికి అక్కడ కూడా భారీ ధరలు ఉండే స్నాక్స్, టికెట్ రేట్ల భారం ఎదురవుతుందని, ఇంతా చేసి వాళ్లకు నాసిరకం సినిమా చూపిస్తే వారు మళ్ళీ ఎందుకు వస్తారని ప్రశ్నించారు.
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
సినిమా మేకింగ్ గురించి ప్రేక్షకులకు ఏమీ తెలియదు అనుకోవడం మేకర్స్ భ్రమ అని రాహుల్ స్పష్టం చేశారు. డిజిటలైజేషన్ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరికీ టెక్నికల్ అంశాలపై అవగాహన పెరిగిందని, ఎవరూ అమాయకులు కాదని హెచ్చరించారు. పాతకాలపు కథలు, అహంకారంతో కూడిన మేకింగ్ పద్ధతులను వీడితేనే థియేటర్ల మనుగడ సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటీటీల కాలంలో కేవలం గొప్ప కంటెంట్ ఉంటేనే జనం బయటకు వస్తారనే రాహుల్ మాటలను నెటిజన్లు ఏకీభవిస్తూ మద్దతు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!