NTV Telugu Site icon

Bharat Jodo Yatra: 600 కిలోమీటర్ల పూర్తి చేసుకున్న రాహుల్ జోడో యాత్ర

Rahul

Rahul

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టారు. సెప్టెంబర్7వ తేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర తమిళనాడు, కేరళలో పూర్తిచేసుకుని ఇటీవల కర్ణాటకలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. కాగా భారత్ జోడో యాత్ర 26వ రోజు కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ప్రవేశించింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పూర్తైన యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించగా రాహుల్ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తుంది. అయితే ఇదే సమయంలో అవకాశం దొరికినప్పుడల్లా రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. తన భారత్ జోడో యాత్రకు రైతు ఉద్యమమే ప్రేరణ అన్నారు. అన్నదాతలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం సాగుతుందని, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందన్నారు. లఖింపుర్ ఘటన జరిగి ఏడాది అయినా.. అమరవీరులైన రైతులకు న్యాయం దక్కలేదన్నారు. ఎప్పటిలాగే బీజేపీ ప్రభుత్వం నేరస్థులను కాపాడుతోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఈ విషయాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. ఇప్పటికి అజయ్ మిశ్రా కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతుండడాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. మరోవైపు ప్రియాంకగాంధీ కూడా లంఖీపూర్ ఖేరీ ఘటనలో కేంద్రప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ ట్వీట్ చేశారు.

Read Also: Terror plans Busted: భారీ పేలుళ్ళకు కుట్ర.. కదులుతున్న ఉగ్రమూలాల డొంక

భారత్‌ జోడో యాత్ర కర్ణాటకలో ఉత్సాహంగా కదులుతోంది. మైసూర్‌లో పాదయాత్ర సందర్భంగా మందిర్‌, మసీదు, చర్చిని రాహుల్‌ సందర్శించారు. దసరా ఉత్సవాల సందర్భంగా చాముండేశ్వరి దేవిని రాహుల్‌గాంధీ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో రాహుల్‌గాంధీ కర్నాటక ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రతి పనుల్లో 40 శాతం కమీషన్‌తో ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. అవినీతిలో కర్నాటక టాప్‌లో ఉంది. ప్రతి పనిలో ఇక్కడ 40 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారు. రైతులు , చిరువ్యాపారులు , కార్మికుల నుంచి లంచాలు తీసుకుంటున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్ర 26వ రోజు కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ప్రవేశించింది. కాగా.. అక్టోబర్ 4, 5 తేదీలో దసరా సందర్భంగా రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకుంటారు. 6వ తేదీ ఉదయం భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది.

Show comments