NTV Telugu Site icon

Rahul Gandhi: శోకసంద్రంలో దేశం.. న్యూ ఇయర్ వేడుకల కోసం వియత్నాంకు రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi

మన్మోహన్ సింగ్‌ మరణానంతరం పలు అంశాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ విరుచుకుపడింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఒకవైపు దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేస్తోందని బీజేపీ పేర్కొంది. మరోవైపు రాహుల్ గాంధీ నూతన సంవత్సర వేడుకల కోసం వియత్నాం వెళ్లారని ఆరోపించింది. మన్మోహన్ సింగ్ చితాభస్మ నిమజ్జనానికి కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి చెందిన వారు ఎవరూ హాజరు కాలేదని బీజేపీ విమర్శించింది.

READ MORE: Rave Party: తూర్పు గోదావరిలో రేవ్ పార్టీ కలకలం.. ఐదుగురు యువతుల సహా…

బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా రాహుల్ గాంధీని విమర్శిస్తూ.. ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. “మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. మరోవైపు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లారు. మాజీ ప్రధాని మరణంపై రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారు. పార్టీ ప్రయోజనాల కోసం ఆయన మరణాన్ని కూడా ఉపయోగించుకున్నారు. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ సిక్కులను ద్వేషిస్తున్నాయి. ఇందిరా గాంధీ దర్బార్ సాహిబ్‌ను అవమానించిన తీరును మర్చిపోవద్దు” అని రాసుకొచ్చారు.

READ MORE: Pawan Kalyan-Nagababu: నాగబాబుకు మంత్రి పదవి.. పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు!

మరోవైపు బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ కూడా స్పందించింది. రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు వెళ్లారని, దీని వల్ల ఎవరికీ ఇబ్బంది లేదని కాంగ్రెస్ పేర్కొంది. ఇది వారి వ్యక్తిగత అంశమని పార్టీ పేర్కొంది. ఈ పార్టీ విభజన రాజకీయాలను ఎప్పుడు విడనాడనుందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ పేర్కొన్నారు. అయితే.. కుటుంబ గోప్యతను గౌరవిస్తూ.. మన్మోహన్ సింగ్ అస్తికలు నిమజ్జనం చేసేందుకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుటుంబంతో పాటు వెళ్లలేదని పార్టీ మీడియా విభాగం అధిపతి పవన్ ఖేరా ఒక ప్రకటనలో తెలిపారు.

Show comments