మన్మోహన్ సింగ్ మరణానంతరం పలు అంశాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ విరుచుకుపడింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఒకవైపు దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేస్తోందని బీజేపీ పేర్కొంది. మరోవైపు రాహుల్ గాంధీ నూతన సంవత్సర వేడుకల కోసం వియత్నాం వెళ్లారని ఆరోపించింది. మన్మోహన్ సింగ్ చితాభస్మ నిమజ్జనానికి కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి చెందిన వారు ఎవరూ హాజరు కాలేదని బీజేపీ విమర్శించింది.