Site icon NTV Telugu

Rahul Gandhi: బొగ్గు రవాణా కార్మికులతో రాహుల్.. 200 కిలోల బొగ్గు ఉన్న సైకిల్ నడిపిన నేత

Rahul

Rahul

జార్ఖండ్‌లో కాంగ్రెస్ ”భారత్ జోడో న్యాయ్ యాత్ర” కొననసాగుతుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారితో మమేకమవుతున్నారు. తాజాగా ఆయన బొగ్గు రవాణా కార్మికులతో కలిసి ముచ్చటించారు. సైకిళ్లపై టన్నుల బరువును మోసుకెళ్తున్న కార్మికుల కష్టాన్ని తెలుసుకునేందుకు 200 కిలోల బొగ్గుతో ఉన్న సైకిల్‌ను నడిపారు. కాగా.. అందుకు సంబంధించిన ఫొటోలను ట్వి్ట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ.

Read Also: Election Commission: ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగించుకోవద్దు.. రాజకీయ పార్టీలకు ఈసీ ఆదేశం

ప్రతిరోజూ 30-40 కిలోమీటర్లు టన్నుల బరువున్న బొగ్గు మూటలతో ప్రయాణం చేస్తారు. వారు ఎంతో కష్టపడి పనిచేస్తే.. ఈ పని నుండి వచ్చే ఆదాయం చాలా తక్కువ అని ట్వీట్ లో పేర్కొన్నారు. వారి బరువు బాధ్యతలను పంచుకోకుండా వారి సమస్యలను అవగాహన చేసుకోలేం అని రాహుల్ ఆ ట్వీట్‌లో తెలిపారు. భారతదేశాన్ని నిర్మించడంలో నిమగ్నమైన ఈ కార్మికులు తమ కష్టానికి సమానమైన వేతనాలు పొందాలి, వారికి న్యాయం జరగాలనేదే ఈ యాత్ర లక్ష్యమన్నారు.

Read Also: Rakul Preet Singh: థాయిలాండ్ లో రకుల్-జాకీ బ్యాచిలర్ పార్టీ..పిక్స్ వైరల్..

కాగా.. ఫిబ్రవరి 2న రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర.. ప్రస్తుతం జార్ఖండ్‌లోని రామ్ గఢ్ లో కొనసాగుతుంది. సోమవారం తన పర్యటనలో భాగంగా 1857 జార్ఖండ్ రివల్యూషన్ లో అమరులైన షేక్ భిఖారి, తికాయిత్ ఉమ్రావ్ సింగ్ కు ఘన నివాళులు అర్పించారు. అంతకుముందు కొత్తగా నియమితులైన చంపాయ్ సోరెన్ నుంచి రాహుల్ గాంధీకి ఘనస్వాగతం లభించింది.

Exit mobile version