Rahul Gandhi: రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర షెడ్యూల్ మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. అయితే త్వరలో జరగనున్న యూపీ షెడ్యూల్‌లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 16న ఉత్తరప్రదేశ్‌లోకి రాహుల్ యాత్ర ప్రవేశించనుంది. అయితే నెక్ట్స్ వీక్ నుంచి అక్కడ బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతో యాత్రను ముందుగానే ముగించాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
యూపీలో ఫిబ్రవరి 22 నుంచి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 26 వరకు కొనసాగనున్న యాత్రను ఈ నెల 21కే ముగిసేలా రాహుల్ మార్పులు చేశారని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్షు అవస్తీ ఓ ప్రకటనలో వెల్లడించారు. రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో ప్రజా ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆయన గుర్తుచేశారు
Also Read
యూపీలో యాత్ర ఇలా ప్రారంభం..
ఫిబ్రవరి 16న వారణాసి మీదుగా యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. అనంతరం భదోహి, ప్రయాగ్‌రాజ్, ప్రతాప్‌గఢ్ మీదుగా ఈ నెల 19న అమేఠీకి చేరుకుంటుంది. ఆ నియోజకవర్గంలోని గౌరీగంజ్ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు. మరుసటి రోజు రాయ్‌బరేలీకి చేరుకుని.. అక్కడి నుంచి లఖ్‌నవూలో రాహుల్‌తో సహా మార్చ్‌లో పాల్గొంటారు. 21న కాన్పూర్‌లోకి యాత్ర ప్రవేశిస్తుంది. అదే రోజు ఝాన్సీ నుంచి మధ్యప్రదేశ్‌లోకి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?