Rahul Gandhi: ‘‘ర్యాలీకి రండి.. షాపింగ్ కూడా చేయండి’’.. రాహుల్ గాంధీ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఓటర్ సవరణ జాబితాలో అక్రమాలు జరిగాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) నిలిపివేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఆదివారం నవంబర్ 1న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రాంలీలా మైదాన్‌లో ప్రతిపక్షాల ర్యాలీ జరగబోతోంది. ఇదిలా ఉంటే, ఈ ర్యాలీ కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటాయని ఢిల్లీ వ్యాపారస్తులు ఇప్పటికే రాహుల్ గాంధీకి పలుమార్లు విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చే ప్రజలు స్థానిక వ్యాపారుల వద్ద కూడా కొనుగోళ్లు చేయాలని సూచించారు. ‘‘నిరసనలకు రండి, షాపింగ్ కూడా చేయండి’’ అంటూ కోరారు. దీపావళి, ఛఠ్, భాయ్ దూజ్ పండగల సందర్భంగా చిన్న వ్యాపారుల వద్ద వస్తువుల్ని కొనుగోలు చేస్తే వారికి ఆర్థికంగా మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ర్యాలీ వల్ల వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగదని, బీజేపీ భయంతోనే అపోహలు సృష్టిస్తోందని ఆరోపించారు.
Also Read
- CJP: మద్దతు ఇస్తాం, కానీ పాల్గొనబోం.. ప్రతిపక్షాల ర్యాలీపై అభిజిత్ దీప్కే..
- UP Elections: 350 స్థానాలు.. యూపీలో బీజేపీ టార్గెట్ ఫిక్స్..
- BJP Rally in Delhi: పొలిటికల్ దంగల్.. INDIA కూటమి ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ నిరసన.. 1984 సిక్కుల ఊచకోత బాధితులకు నివాళి!
- INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులు మోహరింపు
ఇదిలా ఉంటే, ర్యాలీ కోసం రాంలీలా మైదాన్ సిద్ధమైంది. ఢిల్లీ వ్యాప్తంగా 4000 వేల మంది పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రతిక్షాలు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మింటో రోడ్ నుంచి రాంలీలా మైదాన్ వరకు మార్చ్ నిర్వహించబోతున్నాయి. దీని తర్వాత అక్కడ భారీ బహిరంగ సభలో నేతలు ప్రసంగించబోతున్నారు. రామ్‌లీలా మైదాన్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ర్యాలీ జరగనుంది. రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్, వామపక్ష విద్యార్థి సంఘాలు పాల్గొనబోతున్నాయి. ఈ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతు ప్రకటించింది, కానీ తాము హాజరకాబోమని ఆ సంస్థ కన్వీనర్ అభిజిత్ దీప్కే ప్రకటించారు.
<blockquote class=”twitter-tweet”><p lang=”hi” dir=”ltr”>नमस्कार, कल लाखों लोग रामलीला मार्च के लिए दिल्ली आ रहे हैं। त्यौहारों का मौसम है। दिवाली, छठ, भाईदूज का समय है। मैं चाहता हूं जो लाखों लोग बाहर से दिल्ली आ रहे हैं, वो यहां के व्यापारियों की मदद करें। प्रोटेस्ट, मार्च, रैली कीजिए, साथ में थोड़ी सी खरीदारी भी कीजिए – व्यापारियों का फायदा हो जाएगा। मैं जानता हूं व्यापारियों को रैली नुकसान नहीं पहुंचाएगी। BJP डरी हुई है इसलिए अफवाह फैला रही है। मगर, दोनों काम करते हैं। कल मार्च होगा, रैली होगी और लाखों लोग हमारे व्यापारियों की छोटी-छोटी दुकानों में से सामान खरीदेंगे। आप सबको बहुत-बहुत प्यार। शुभ दिवाली। जय हिंद। Tomorrow, lakhs of people are coming to Delhi for the Ramlila March. It is the festive season. Diwali, Chhath and Bhai Dooj are here. I want the lakhs of people coming to Delhi from different parts of the country to support the local traders here. Tomorrow, along with protesting, marching and attending the rally, do a little shopping too. It will help our local traders. I know that our rally will not hurt the traders. The BJP is spreading rumours because it is scared. But let’s do both. Tomorrow, there will be a march, there will be a rally, and lakhs of people will also buy things from the small shops of our local traders. Much love to all of you. Happy Diwali. Jai Hind.</p>— Rahul Gandhi (@RahulGandhi) <a href=”https://x.com/RahulGandhi/status/2116580889291575517?ref_src=twsrc%5Etfw”>October 31, 2026</a></blockquote> <script async src=”https://platform.x.com/widgets.js” charset=”utf-8″></script>
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Rahul Gandhi: ‘‘ర్యాలీకి రండి.. షాపింగ్ కూడా చేయండి’’.. రాహుల్ గాంధీ పిలుపు..
-
State Election Commissioner: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
-
AP Municipal Elections 2026: ఏపీలో 8.39 శాతం ఓటింగ్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
CJP: మద్దతు ఇస్తాం, కానీ పాల్గొనబోం.. ప్రతిపక్షాల ర్యాలీపై అభిజిత్ దీప్కే..
-
UP Elections: 350 స్థానాలు.. యూపీలో బీజేపీ టార్గెట్ ఫిక్స్..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!