Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: న్యూఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశాలు ముగిశాయి. ఇప్పుడు ఇక రాజకీయమే మిగిలింది. కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ రాజకీయ వేడి పుట్టించింది. బ్రిక్స్ సదస్సులో విదేశీ నేతలకు వడ్డించిన శాఖాహార విందు మెనూపై ఆయన విమర్శలు గుప్పించారు. దేశంలో 80 శాతం మంది భారతీయులు నాన్-వెజ్ ఆహారం తీసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఈ డిన్నర్ మెనూపై రాజకీయంగా మాటల యుద్ధం మొదలైంది.
“రికార్డు కోసం చెబుతున్నాను.. 80 శాతం మంది భారతీయులు నాన్-వెజిటేరియన్లు. భారతీయ నాన్-వెజిటేరియన్ వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. అలాగే నా సోదరి చేసే చోలే భటూరే కూడా” అంటూ రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనితో పాటు చోటే భటూరే ఫోటోను కూడా షేర్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలకు మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మద్దతు తెలిపారు. భారతదేశంలోని వంటకాల వైవిధ్యంలో ప్రపంచ స్థాయి మాంసాహార వంటకాలు కూడా ఉన్నాయని అన్నారు. అలాంటి వంటకాలను విదేశీ నేతలకు ఎందుకు పరిచయం చేయలేదు అని ప్రశ్నించారు. భారతీయులపై బీజేపీ తన ఆహారపు అభిరుచుల్ని రుద్దుతోందని, ఇప్పుడు విదేశీ నేతలు, అతిథులపై కూడా ఇదే జరుగుతోందని విమర్శించారు.
Also Read
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
అయితే, ఈ కామెంట్లకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఘాటు సమాధానం ఇచ్చారు. బ్రిక్స్ దేశాధినేతలు భారతీయ శాఖాహార వంటకాలను ఆస్వాదించారని అన్నారు. బ్రిక్స్ దేశాల నేతలకు వడ్డించిన ఆహార మెనూపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందంటే నమ్మలేకపోతున్నాను అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశంలో వివిధ ప్రాంతాలను ప్రతిబింబించేలా ఈ శాఖాహార మెనూను రూపొందించినట్లు ఆయన చెప్పారు. రుచితో పాటు పోషక విలువలకు కూడా ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు.
విందు మెనూలో ఏమున్నాయి..?
బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన విందులో పూర్తిగా శాఖాహార వంటకాలను వడ్డించారు. మెనూలో ఖాండ్వీ, పనీర్ లబాబ్దార్, గుచ్చి మార్మిక్, మిల్లెట్ పులావ్, మష్రూమ్ గలౌటీ, జిలేబీ వంటి వంటకాలు ఉన్నాయి. మిల్లెట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. భారత్ ప్రోత్సహిస్తున్న ‘‘శ్రీ అన్న’’ పాటు సుస్థిర ఆహార విధానాన్ని కూడా ఈ మెనూలో ప్రతిబింబించేలా రూపొందించారు.
For the record: 80% of Indians are non-vegetarian.
Indian non-vegetarian food is delicious. As are my sister's chole bhature. pic.twitter.com/8f6ziKjLan
— Rahul Gandhi (@RahulGandhi) September 13, 2026
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!