AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AA24 Secret Out: పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అడుగులు ఇప్పుడు మరింత దూకుడుగా మారాయి. వరుస భారీ ప్రాజెక్టులతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బన్నీ, ఇప్పుడు తన మైల్ స్టోన్ ఫిల్మ్ ‘#AA24’ కోసం ఎలాంటి జోనర్ ఎంచుకుంటారు? డైరెక్టర్ ఎవరు? అనే ప్రశ్నలు గత కొంతకాలంగా టాలీవుడ్‌ను ఊపేస్తున్నాయి. అయితే తాజాగా నెట్టింట ప్రత్యక్షమైన ఒకే ఒక్క ఫొటో సినీ ప్రియుల అనుమానాలను దాదాపు నిజం చేస్తూ, సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మలయాళ చిత్రసీమలో సూపర్ హీరో సబ్జెక్ట్‌తో ఇండియన్ సినిమా దృష్టిని తనవైపు తిప్పుకున్న ‘మిన్నల్ మురళి’ దర్శకుడు బాసిల్ జోసెఫ్. ఆయనతో కలిసి పలు సంచలన చిత్రాలకు కలం పట్టిన స్టార్ కో-రైటర్ అరుణ్ అనిరుధన్ తాజాగా పెట్టిన ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో కార్చిచ్చు రేపింది. అల్లు అర్జున్‌కు అత్యంత ఇష్టమైన లగ్జరీ కార్ రేంజ్ రోవర్ ‘బీస్ట్’ వద్ద దిగిన ఫొటోను అరుణ్ పంచుకోవడమే ఇందుకు కారణం. బన్నీ సొంత వాహనం దగ్గర, ఆయన వ్యక్తిగత ప్రాంగణంలో ‘మిన్నల్ మురళి’ రైటర్ కనిపించడంతో నెటిజన్లు ఒక్కసారిగా డాట్స్ కనెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు.
కొంతకాలంగా అల్లు అర్జున్ – బాసిల్ జోసెఫ్ కాంబో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుందంటూ ఫిలింనగర్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బాసిల్ రైటింగ్ టీమ్ నేరుగా బన్నీ అడ్డాలోకి ఎంట్రీ ఇవ్వడంతో, కథా చర్చలు కేవలం మాటలకే పరిమితం కాలేదని.. తుది దశకు చేరిపోయాయని స్పష్టమవుతోంది. ఐకాన్ స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా బాసిల్ బృందం ఓ సరికొత్త కంటెంట్‌తో కూడిన విభిన్నమైన స్టోరీని రెడీ చేసిందని, గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అరుణ్ అనిరుధన్ లాంటి టాలెంటెడ్ రైటర్ పవర్ఫుల్ స్క్రిప్ట్, బాసిల్ జోసెఫ్ సరికొత్త నేరేషన్, వీటన్నింటికీ తోడు అల్లు అర్జున్ మాస్ అండ్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే థియేటర్లలో విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కేవలం ఒకే ఒక్క ఇన్‌స్టా పిక్‌తో ‘#AA24’ హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడితే ఇండియన్ సినీ చరిత్రలోనే మరో బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!