Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- భారత్‌కు హైస్పీడ్ ఇవోల్గా రైలును ఆఫర్ చేసిన రష్యా..
- ఇప్పటికే వందేభారత్ స్లీపర్ ప్రాజెక్టులో భాగమైన కంపెనీ..
- గంటకు 360 కి.మీ వేగంతో ప్రయాణించే సత్తా ఇవోల్గా సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ivolga high-speed train: భారత్ తన పాతకాలపు రైల్వే వ్యవస్థను ఆధునీకీకరించే పనిలో ఉంది. ఈ నేపథ్యంలోనే వందేభారత్, వందే భారత్ స్లీపర్, నమో భారత్, బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టుల్ని తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే, రష్యా తనక హై-స్పీడ్ ట్రైన్ టెక్నాలజీని భారత్‌కు ఇచ్చేందుకు ప్రతిపాదించింది. ఇన్నోప్రోమ్.ఇండియా కార్యక్రమంలో ఈ ప్రతిపాదనను సమర్పించినట్లు తెలుస్తోంది. రష్యాకు చెందిన ట్రాన్స్‌మాష్ హోల్డింగ్ సంస్థ తన ‘‘ఇవోల్గా హై స్పీడ్ రైలు’’ను భారత్‌కు ఇవ్వాలనుకుంటోంది.
గంటలకు 360 కి. మీ వేగం..
రష్యా ప్రతిపాదించిన ఇవోల్గా హైస్పీడ్ రైలు గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 8 బోగీలు ఉండే ఈ రైలు 642 మంది ప్రయాణికుల్ని తీసుకెళ్తుంది. దీని జీవిత కాలం 30 ఏళ్లు. ఈ రైలు సుమారు 80 శాతం స్థానిక పరికరాలు ఉపయోగించిన నిర్మించవచ్చని రష్యా ప్రతిపాదించింది. టెక్నాలజీ బదిలీ, స్థానిక తయారీకి అవకాశం కల్పిస్తే ఇది భారత్ చేపడుతున్న ‘‘మేక్ ఇన్ ఇండియా’’, ‘ఆత్మ నిర్భర భారత్’’ లక్ష్యాలను నెరవేర్చినట్లు అవుతుంది.
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
వందే భారత్‌లో భారత్‌లోకి ఎంట్రీ..
ట్రాన్స్‌మాష్ హోల్డింగ్ ఇప్పటికే భారత రైల్వే రంగంలో భాగస్వామిగా ఉంది. వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీలో భారత్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 120 వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ ఒప్పందం కుదిరింది. ఈ అనుభవం ఆధారంగా రష్యా ఇప్పుడు భారత్‌కు హై స్పీడ్ రైలును ఆఫర్ చేస్తోంది.
మౌలిక సదుపాయాలు ముఖ్యమే..
హైస్పీడ్ రైలు పరుగులు తీయాలంటే దానికి అనుగుణంగా రైల్వే ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థ, విద్యుదీకరణం, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ ఇలా అన్నింటిని చూసుకోవాల్సి ఉంటుంది. హైస్పీడ్ రైళ్లకు తగ్గట్లుగా ట్రాక్ మార్పులు చేయాల్సి ఉంటుంది. దీంతో రష్యా ప్రతిపాదనను భారత్ అంగీకరించే ముందు రైలు వేగంతో పాటు మొత్తం ప్రాజెక్టు వ్యయం, భద్రత, నిర్వహణ, స్థానిక తయారీ, టెక్నాలజీ బదిలీ వంటి అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.
ఒక వేళ ఇవోల్గా ప్లాన్ కార్యరూపం దాలిస్తే భారత్-రష్యా సహకారం ఇప్పుడు రైల్వేకు విస్తరించినట్లు అవుతుంది. రైళ్లను నేరుగా దిగుమతి చేసుకోకుండా స్థానికంగా ఉత్పత్తి చేయడం వల్ల భారతీయ పరిశ్రమలకు సాంకేతికంగా కలిసి వస్తుంది. ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!