Site icon NTV Telugu

Rahul Gandhi: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: అనర్హత వేటుకు గురైన కారణంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు. లోక్‌సభ హౌజింగ్ కమిటీ ఇచ్చిన నోటీసు కారణంగా ఆయన నేడు బంగ్లాను ఖాళీ చేశారు. తన సామాన్లను ట్రక్కులో తరలించారు. పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. తర్వాత లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలు చేపట్టింది. అనర్హత వేటు పడింది. ఏప్రిల్ 22లోగా రాహుల్ తన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌజింగ్ కమిటీ గతంలోనే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ తన బంగ్లాను ఈరోజు ఖాళీ చేశారు. ఇక, రాహుల్ గాంధీ లోక్‌సభకు వరుసగా నాలుగోసారి ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ తొలిసారిగా అమెథీ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో, ఆయనకు ఢిల్లీలోని తుగ్లక్‌ లేన్‌లో బంగ్లాను కేటాయించారు. నాటి నుంచి ఆయన అక్కడే నివాసం ఉంటున్నారు.

ఇల్లు ఖాళీ చేయడానికి ఏప్రిల్ 22 వరకు గడువు ఉంది.ఇల్లు ఖాళీ చేసేందుకు అంగీకరించిన రాహుల్ గాంధీకి ఆ పార్టీ నేతలు ఇంటి ఆఫర్లతో స్వాగతించారు. మా ఇంట్లో ఉండాలంటూ స్వాగతం పలికారు. 52 ఏళ్ల కాంగ్రెస్ మాజీ చీఫ్ కార్యాలయం బదిలీ ప్రక్రియ కొనసాగుతోందని, ప్రస్తుతం తన తల్లి సోనియా గాంధీ జన్‌పథ్ నివాసానికి మారుతున్నట్లు చెప్పారు. ఈ ఇల్లును అప్పగించడానికి కొంత సమయం పడుతుందని, నిర్ణీత తేదీ కంటే ముందే పూర్తి చేస్తామని కాంగ్రెస్ నాయకుడి కార్యాలయం తెలిపింది.

Read Also: Delhi Liquor Scam: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు

“వారు (బీజేపీ) నా ఇంటిని లాక్కొని నన్ను జైల్లో పెట్టగలరు, కానీ వాయనాడ్ ప్రజలకు, వారి సమస్యలకు ప్రాతినిధ్యం వహించకుండా నన్ను ఆపలేరు” అని రాహుల్ గాంధీ ఈ వారం ప్రారంభంలో తన మాజీ నియోజకవర్గాన్ని సందర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేరస్థుడంటూ 2019 ప్రచార ట్రయల్‌లో చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో దోషిగా తేలింది.క్రిమినల్ పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ చేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 20న తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని సూరత్‌లోని సెషన్స్ కోర్టు గురువారం తెలిపింది.

 

 

Exit mobile version