Rahul Gandhi: అయోధ్యలో ఒక్క దళితుడైనా కనిపించారా?.. రాహుల్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీపై (PM Modi) కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సమయంలో ఒక్క దళితుడైనా కనిపించారా? అని రాహుల్ ప్రశ్నించారు. దళితులే కాదు.. ఆదివాసి అయినా రాష్ట్రపతి ముర్మును కూడా కేంద్రం ఆహ్వానించలేదన్నారు. కానీ అంబానీ, అదానీ, అమితాబ్ బచ్చన్ కుటుంబం (Amitabh Bachchan) మాత్రం కనిపించిందని రాహుల్ వ్యాఖ్యానించారు. దీని బట్టి రామమందిరంలో దళితులకు, ఆదివాసీలకు చోటు లేదని అర్థమవుతుందని రాహుల్ చెప్పుకొచ్చారు.
గత నెల 22న అయోధ్య రామమందిరాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులను కేంద్రం ఆహ్వానించింది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి రాహుల్.. తన ప్రసంగంలో బచ్చన్ పేర్లను లేవనెత్తారు. రామమందిర ప్రారంభోత్సవంలో ఓబీసీలకు చోటు లేదా? అంటూ మోడీని రాహుల్ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఈ ప్రోగ్రామ్‌కి ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan) హాజరుకాలేదు.. కానీ వారి పేర్లను రాహుల్ ప్రస్తావించారు.
Also Read
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతకముందు రాహుల్‌కు ఘనస్వాగతం లభించింది. ఈనెల 16న వారణాసిలో రాహుల్ యాత్ర ప్రవేశించింది. ఈనెల 21 వరకు యూపీలో యాత్ర కొనసాగుతోంది.
గత ఎన్నికల్లో అమేథీలో రాహుల్ ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్మతి ఇరానీ చేతిలో రాహుల్ ఓటమిని ఎదుర్కొన్నారు. తాజాగా అదే నియోజకవర్గంలో రాహుల్ యాత్ర కొనసాగుతోంది ఇదిలా ఉంటే ప్రస్తుతం స్మృతి ఇరానీ కూడా అమేథీలోనే పర్యటిస్తు్న్నారు. అలాగే ప్రధాని మోడీ కూడా లక్నోలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఇంకోవైపు ఇండియా కూటమి మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ మాత్రం రాహుల్ యాత్రలో పాల్గొన లేదు. సీట్లు పంపకాలపై క్లారిటీ వచ్చాకే రాహుల్ యాత్రలో పాల్గొంటానని అఖిలేష్ తేల్చి చెప్పారు.
"President Murmu, an Adivasi, wasn't allowed to attend Ram Mandir event": Rahul Gandhi attacks Centre
Read @ANI Story | https://t.co/hRM2qSIshA#RahulGandhi #DroupadiMurmu #BJP #CongressParty pic.twitter.com/iq5UVjNEpl
— ANI Digital (@ani_digital) February 19, 2024
#WATCH | Uttar Pradesh: Congress leader Rahul Gandhi's Bharat Jodo Nyay Yatra resumes from Amethi, Uttar Pradesh. pic.twitter.com/AV3sLseuEg
— ANI (@ANI) February 19, 2024
తాజావార్తలు
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్‌దే ఐపీఎల్ 2026 టైటిల్?
-
Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
-
Tiffany Trump: తాజ్ మహల్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ బిడ్డ.. భారత్‌లో టిఫనీ సందడి మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..