కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జూన్ 19న తన 55వ పుట్టినరోజును అత్యంత సరళంగా జరుపుకున్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడి, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరిన కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నారు. రాహుల్ తన నివాసం 24 అక్బర్ రోడ్‌లో కార్యకర్తలు, నాయకులను కలిశారు. అక్కడ వాళ్లు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేయడానికి నిరాకరించారు.
READ MORE: Anaya Bangar: “నేను మహిళల క్రికెట్‌కి అర్హురాలిని” ట్రాన్స్ ఉమెన్ అనయ బంగార్ సంచలనం..!
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూడా సరళతను పాటించాలని నిర్ణయించింది. పార్టీ ప్రధాన కార్యాలయం లోపల డ్రమ్స్ మోగించడానికి అనుమతి ఇవ్వలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు రాహుల్ గాంధీని కలవాలని కోరుకుంటున్నారని పార్టీ తెలిపింది. అందువల్ల, రాహుల్ గాంధీ వారిని మాత్రమే కలిశారు. ఈ సందర్భంగా, రాహుల్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
READ MORE: Harish Rao: బూతులు తెలుసుకున్నంత సులువు కాదు.. బేసిన్ల గురించి తెలుసుకోవడం!
కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ రాహుల్ గాంధీ సున్నితత్వాన్ని ప్రశంసించారు. “రాహుల్ చాలా సున్నితంగా ఉంటారు. ఆయన ప్రజలను మాత్రమే కలిశారు. కేక్ కట్ చేయడానికి నిరాకరించారు. మరోవైపు, ఈ దుఃఖ సమయంలో కూడా ఫ్రెంచ్ అధ్యక్షుడిని కలిసిన మోడీ నవ్వుతున్న చిత్రాలను పంచుకుంటున్నారు. ఎక్స్‌లో సంతోషంగా, చురుగ్గా కనడబుతున్నారు.” అని ఆమె అన్నారు.
