Congress vs BJP: కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మధ్య ఆధిపత్య పోరు గత కొన్నేళ్లుగా కొనసాగుతుందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రిసెంట్ గా లోక్‌సభ ఎన్నికల్లో కిషోరి లాల్ శర్మ అమేథీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత ఈ ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శిబిరం తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, బావమరిది రాబర్ట్ వాద్రాలను కావాలనే పక్కన పెట్టిందని ఇవాళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విమర్శలు గుప్పించింది.
Read Also: Sucharita Mohanty: కాంగ్రెస్ నిధులు ఇవ్వడం లేదు.. అందుకే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు..
కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పాపులారిటీ ఉందని చెబుతున్నా రాహుల్ గాంధీ శిబిరం రాబర్ట్ వాద్రాను అమేథీ సీటు ఇవ్వకపోవడంతో పాటు ఆయన్నీ పట్టించుకోలేదని బీజేపీ నేత అమిత్ మాల్వియా అన్నారు. ప్రియాంక గాంధీ వాద్రా త్వరలో కాంగ్రెస్ నాయకత్వంపై తిరుగుబాటు చేసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. వారిద్దరినీ ఒక క్రమపద్ధతిలో రాహుల్ గాంధీ పక్కదారి పట్టిస్తున్నాడని మాళవియ పేర్కొన్నారు. అలాగే, ప్రియాంక గాంధీ వాద్రాపై కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సైతం ఆరోపించారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయకూడదనుకుంటే.. ప్రధాని నరేంద్ర మోడీపై వారణాసి నుంచి పోటీ చేస్తే సరిపోయేది కదా అని ప్రశ్నించారు.
Read Also: Guess The Actress : ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఇలా మారిపోయిందేంటి?
గత నెలలో రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. తనకు అమేథీలో మంచి ప్రజాదరణ ఉందని పేర్కొన్నారు. తాను క్రియాశీల రాజకీయాల్లో ఉండాలని దేశం కోరుకుంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే.. నేను మార్పు తీసుకురాగలను.. అమేథీ నుంచి కాకపోయినా.. మొరాదాబాద్ లేదా హర్యానా నుంచి కూడా పోటీ చేయగలన్నారు. ఇక, రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన అమేథీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారనే ఊహాగానాలు వచ్చాయి. అలాగే, ఆ స్థానం నుంచి సోనియా గాంధీ తప్పుకోవడంతో ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జోరుగా జరిగింది. కానీ, చివరకు అక్కడ రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.