Rahul Gandhi Hyderabad Visit: హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ?.. భారత్ సమ్మిట్, గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Hyderabad Visit: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం ముగిసింది. ఢిల్లీలో దాదాపు అరగంట పాటు భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, బీసీలకు ప్రాతినిధ్యం వంటి అంశాలపై చర్చించినట్లు మహేశ్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంస్థాగత కార్యక్రమాలపై రాహుల్ గాంధీకి నివేదిక అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పీసీసీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలను వివరించామన్నారు. ముఖ్యంగా ఓబీసీల సమస్యలు, వారికి రాజకీయంగా కల్పించాల్సిన ప్రాతినిధ్యంపై చర్చ జరిగినట్లు మహేశ్ గౌడ్ చెప్పారు.
భారత్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ నవంబర్ 13 లేదా 14 తేదీల్లో హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని మహేశ్ గౌడ్ తెలిపారు. అయితే పర్యటన తేదీలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. భారత్ సమ్మిట్‌తో పాటు హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని రాహుల్ గాంధీ సూచించినట్లు వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం గిగ్ యాక్ట్ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్ల సమస్యలు, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలపై రాహుల్ గాంధీ వారితో సమావేశమై మాట్లాడనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు తెలిపారు.
Also Read
- Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
- BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
- AP MPP, ZPP Indirect Elections 2026: స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. MPP, ZPP ఎన్నికల తేదీలు ఖరారు!
- iTDP and YSRCP: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లొద్దు.. ఐటీడీపీ, వైసీపీ కీలక ప్రకటనలు!
హైదరాబాద్‌లో సర్‌కు వ్యతిరేకంగా నిర్వహించనున్న సభతో పాటు మెగా బీసీ ర్యాలీకి కూడా రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు మహేశ్ గౌడ్ వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమాలకు సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు, వివాదాలపై రాహుల్ గాంధీతో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాలను పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చూసుకుంటారని తెలిపారు. నవంబర్ నెలలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. మరోవైపు సోనియా గాంధీ ఆత్మకథను స్వాగతిస్తున్నామని, తెలంగాణలో ఆ పుస్తకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు చెప్పారు.
తాజావార్తలు
-
Rahul Gandhi Hyderabad Visit: హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ?.. భారత్ సమ్మిట్, గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశం!
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
Ravi Shastri Commentary: 1994లో మొదలైన ప్రయాణం.. కామెంటరీలో తన గురువులెవరో వెల్లడించిన రవిశాస్త్రి!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
AP MPP, ZPP Indirect Elections 2026: స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. MPP, ZPP ఎన్నికల తేదీలు ఖరారు!
ట్రెండింగ్
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!