Site icon NTV Telugu

Rahul Gandhi: హర్యానా ఓటర్ జాబితాలో బ్రెజిలియన్ మోడల్..? ఈసీని నిలదీసిన రాహుల్‌ గాంధీ

Rahul

Rahul

Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఓట్‌ చోరీ అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. “హెచ్ ఫైల్స్” అనే శీర్షికతో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ ఎన్నికల రిగ్గింగ్ గురించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీహార్‌లోని 121 అసెంబ్లీ స్థానాలకు మొదటి దశ పోలింగ్ జరగడానికి కొన్ని రోజుల ముందు ఈ విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తుతూ ఎన్నికల సంఘాన్ని నిలదీశారు.

READ MORE: Harmanpreet Kaur Wax Statue: టీమిండియా కెప్టెన్ కు అరుదైన గౌరవం.. ఆ మ్యూజియంలో మైనపు విగ్రహం..!

రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ఒక యువతి ఫోటోను చూపించారు. ఈ యువతి 22 సార్లు ఓటు వేసిందన్నారు. కొన్నిసార్లు సీమ పేరుతో మరి కొన్ని సార్లు సరస్వతి పేరుతో ఓట్లు వేసినట్లు రాహుల్ గాంధీ చెప్పారు. ఈమె ఓ బ్రెజిలియన్ మహిళ అని.. హర్యానా ఓటర్ల జాబితాలో ఏం చేస్తుందని నిలదీశారు. బ్రెజిలియన్ మోడల్ ఫోటోగ్రాఫ్ సీమా.. స్వీటీ, సరస్వతి వంటి వివిధ పేర్లతో ఓటర్ల జాబితాలో అనేకసార్లు కనిపించిందని రాహుల్‌గాంధీ వివరించారు. ఆమె 22 సార్లు ఓట్లు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం.. హర్యానాలో ఐదు కేటగిరీల్లో 25 లక్షల ఓట్లు చోరీకి గురయ్యాయని ఆరోపించారు. 5 లక్షల 21 వేలకు పైగా నకిలీ ఓటర్లు దొరికారని చెప్పారు. హర్యానాలో మొత్తం 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 25 లక్షల ఓట్లు చోరీ అయ్యాయి. అంటే ప్రతి ఎనిమిది మంది ఓటర్లలో ఒకరు నకిలీ అని అర్థం. దీని కారణంగా, కాంగ్రెస్ ఓడిపోయిందని రాహుల్ ఆరోపించారు.

READ MORE: Hospital Negligence: శ్వాసకోశ సమస్యతో వెళ్తే ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చిన ఆస్పత్రి.. షాకైన పేషెంట్!

Exit mobile version