Site icon NTV Telugu

Bharat Jodo Yatra: అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు యాత్రను నిలిపివేసిన రాహుల్

Rahul Gandhi

Rahul Gandhi

Bharat Jodo Yatra: ఢిల్లీలో అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం తన భారత్ జోడో యాత్రను అపోలో ఆసుపత్రి సమీపంలో నిలిపివేశారు. అంబులెన్స్‌ని వెళ్లనివ్వడానికి కాసేపు ఆగాడు. అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని తోటి యాత్రికులను కూడా కోరాడు. ఈ సంఘటన దేశ రాజధానిలోని అపోలో ఆసుపత్రి సమీపంలో జరిగింది. ఇవాళ ఉదయం 8:30 గంటలకు గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర ఉదయం హర్యానాలోని బదర్‌పూర్ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది. బదర్‌పూర్ బోర్డర్ నుంచి ప్రారంభమయ్యే యాత్ర ఢిల్లీలోని 23 కిలోమీటర్ల మేర సాగి ఎర్రకోట దగ్గర ముగుస్తుంది. ఈ యాత్ర ఆశ్రమ్ చౌక్, నిజాముద్దీన్, ఇండియా గేట్, ఐటీవో, రెడ్ ఫోర్ట్, రాజ్ ఘాట్ మీదుగా వెళుతుంది. ఎర్రకోటకు వెళ్లే ముందు ఆశ్రమ చౌక్ వద్ద రెండు గంటల విరామం తీసుకోనున్నారు. భారత్ జోడో యాత్ర ఇప్పటికే దాదాపు 3,000 కిలోమీటర్లు ప్రయాణించింది.

Encounter: బీజాపూర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు బీజేపీని ఎండగట్టేందుకు కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన రాహుల్ గాంధీ పాదయాత్ర కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా మీదుగా ప్రస్తుతం ఢిల్లీకి చేరింది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర ఐదు నెలల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగనుంది. మొత్తంగా 3570 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ. కాశ్మీర్‌లో జరిగే జోడో యాత్రతో ఈ పాదయాత్ర ముగియనుంది. 2023 జనవరి26న కాశ్మీర్ లో ఈ యాత్ర ముగియనుంది.

Exit mobile version