Rahul Gandhi: ఈసీకి బీజేపీతో పొత్తు ఉంది.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: బీహార్లో SIR కి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర ఆదివారం 8వ రోజు చేరుకుంది. ఈసందర్భంగా పూర్ణియాలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, ముఖేష్ సాహ్ని, CPI(ML) నాయకుడు దీపాంకర్ భట్టాచార్య, పప్పు యాదవ్ తదితర నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు.
Also Read
- CM Revanth Reddy : విద్యతోనే సామాజిక మార్పు, రాజ్యధికారం
- Yogi Adityanath: "1947లో మోడీ ప్రధానిగా ఉండుంటే".. కాంగ్రెస్, దేశ విభజనపై యోగి సంచలనం..
- CJI Surya Kant: యువతను తప్పుదారి పట్టించారు.. ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ..
- Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పలేదు..
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈసీకి బీజేపీతో పొత్తు ఉందని అన్నారు. ఇప్పటివరకు తన ప్రశ్నలకు ఈసీ ఎలాంటి సమాధానాలు చెప్పలేదన్నారు. కర్ణాటకలో కొత్తగా లక్ష మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారని అడిగిన ప్రశ్నకు ఎన్నికల కమిషన్ నుంచి సమాధానం రాలేదని విమర్శించారు. బీజేపీ నాయకుడు అనురాగ్ ఠాకూర్ నకిలీ ఓటర్లను చేర్చారని మాట్లాడితే ఆయన నుంచి ఎటువంటి అఫిడవిట్ అడగలేదని, కానీ తన నుంచి మాత్రం అఫిడవిట్ అడిగారని ఈసీపై ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల కమిషన్ ఎవరి వైపు ఉందో మీడియాకు కూడా తెలుసని చెప్పారు. తమ యాత్ర కారణంగా బీహార్లో ప్రతిఒక్కరూ రాజకీయంగా చురుకుగా మారారని అన్నారు.
బీహార్లో ఓట్ల చోరీ జరగనివ్వం..
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీహార్లో తమ యాత్ర చాలా విజయవంతమైంది, ప్రజలు స్వయంగా యాత్రలో పాల్గొనడానికి వస్తున్నారని అన్నారు. దీంతో ఓట్ల దొంగతనం గురించి మేము చెప్తున్న విషయాలు బీహార్లోని కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపుతున్నాయని అర్థం అవుతుందన్నారు. ఎన్నికల కమిషన్ పని సరైన ఓటర్ల జాబితాను అందించడమని, కానీ వారు మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలో అలా చేయలేదని మండిపడ్డారు. బీహార్లో ఓట్లను దొంగిలించడానికి తాము అనుమతించమని స్పష్టం చేశారు. వాళ్లు మహారాష్ట్రలో, హర్యానాలో, కర్ణాటకలో ఓట్లు దొంగిలించారని తాము స్పష్టంగా చూపించామని, కానీ ఇక్కడ మాత్రం అది జరగనివ్వమని అన్నారు.
బీజేపీ పార్టీ సెల్గా ఈసీ..
ఎన్నికల కమిషన్ బీజేపీ పార్టీ సెల్గా, ఆ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తోందని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ విమర్శులు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కును, ప్రజల ఉనికిని కాపాడటానికి, రాహుల్ గాంధీతో కలిసి మనమందరం ఈ ప్రయాణాన్ని ప్రారంభించామని అన్నారు. ఈ ప్రయాణంలో ఒక విషయం స్పష్టంగా తెలుస్తుందని.. ఇక్కడ మాత్రం ఓట్లు చోరీ జరగనివ్వమని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు.
READ ALSO: Missing Plane Mystery: జాడలేని విమానం .. 22 రోజులుగా మిస్సింగ్..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యతోనే సామాజిక మార్పు, రాజ్యధికారం
-
Yogi Adityanath: “1947లో మోడీ ప్రధానిగా ఉండుంటే”.. కాంగ్రెస్, దేశ విభజనపై యోగి సంచలనం..
-
CJI Surya Kant: యువతను తప్పుదారి పట్టించారు.. ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ..
-
Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
-
Harbhajan Singh: వారి త్యాగాలు లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు.. భావోద్వేగానికి గురైన హర్భజన్ సింగ్..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!