Rahul Gandhi : ఫాసిస్టు శక్తులను తరిమికొడతాం.. హైదరాబాద్ వేదికగా రాహుల్ గాంధీ పిలుపు
- భారత్ సమ్మిట్‌లో విదేశీ ప్రతినిధుల అంశాన్ని ప్రస్తావించిన రాహుల్
- అన్నీ తమకే తెలుసనుకునే వారే ఫాసిస్టులు.. రాహుల్ వ్యాఖ్యలు
- మోడీ, అదానీల కలయికతో వ్యాపార, రాజకీయ సంబంధాలపై విమర్శలు
- ద్వేషంతో కాదు.. ప్రేమ, అహింసతోనే పోరాటం చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ‘భారత్ సమ్మిట్’ ముగింపు సభలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోడీ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని, ఫాసిస్టు శక్తులపై ప్రేమ, అహింస అనే ఆయుధాలతోనే తాము పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రతినిధులను కేంద్రం అడ్డుకుంది.. క్షమాపణలు చెప్పిన రాహుల్
సదస్సు ప్రారంభంలోనే రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావాల్సిన పలువురు విదేశీ నాయకులు, ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని ఆరోపించారు. కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడం వల్లే వారిని రప్పించలేకపోయామని చెబుతూ.. సదస్సుకు రాలేకపోయిన ప్రతినిధులందరికీ ఆయన బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.
Also Read
- Singur Project: సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల.. రెండు గేట్లు ఎత్తిన అధికారులు
- Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
- CM Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు.. గిగ్ వర్కర్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి
అన్నీ తమకే తెలుసనుకునే వారే ఫాసిస్టులు
ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారని రాహుల్ గాంధీ విశ్లేషించారు. అందరి మాట వింటూ నేర్చుకునే వారు కొందరైతే, అన్నీ తమకే తెలుసని, తామే దేవుళ్లమని భావించే వారు మరికొందరు ఉంటారని అన్నారు. రాజకీయాల్లో ఇలాంటి ధోరణి ఉన్నవారినే ‘ఫాసిస్టులు’ అంటారని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవస్థలు కుప్పకూలినప్పుడే ఫాసిస్టులు బయటకు వస్తారని, వారు కేవలం గట్టిగా అరుస్తారే తప్ప ఇతరుల మాట వినరని విమర్శించారు. మెజారిటీ ప్రజలు వినయంతో ఉండి ఇతరుల బాధలను అర్థం చేసుకుంటారని, గత దశాబ్ద కాలంగా దేశంలో ఫాసిస్టుల ఆగడాలు పెరిగిపోయాయని, ప్రస్తుతం దేశంలో ఈ రెండు వర్గాల మధ్యే అసలైన పోరాటం జరుగుతోందని రాహుల్ పేర్కొన్నారు.
మోడీ, అదానీల కలయికపై ఆరోపణలు
దేశ ఆర్థిక వ్యవస్థ, కార్పొరేట్ విధానాలపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రపంచ కుబేరుల జాబితాలో 600వ స్థానంలో ఉన్న ఒక వ్యాపారవేత్త, ఏడు నెలల క్రితం ఏకంగా 2వ స్థానానికి చేరుకున్నారని పరోక్షంగా అదానీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ, అదానీల కలయిక వల్ల రాజకీయాలకు, వ్యాపారానికి మధ్య ఉన్న గీత చెరిగిపోయిందని ఆరోపించారు. ఎయిర్‌పోర్టులు, పోర్టులు, బ్రిడ్జిలు, సిమెంట్, డిఫెన్స్.. ఇలా ఏ రంగం చూసినా అదానీ ఆస్తులే కనిపిస్తున్నాయని విమర్శించారు. గత దశాబ్ద కాలంలో బీజేపీ ఆస్తులు 11 రెట్లు పెరిగాయని, ఎవరూ పోటీ పడలేని ఆర్థిక శక్తిగా ఆ పార్టీ మారిందని అన్నారు. మీడియా, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, బహిరంగ సభలన్నీ మోడీ గుప్పిట్లోకి వెళ్లిపోయాయని, టీవీలు, సోషల్ మీడియాలో 24 గంటలూ మోడీ, బీజేపీనే చూపిస్తూ ప్రతిపక్షాలకు కనీస మద్దతు లేకుండా చేశారని మండిపడ్డారు.
ద్వేషంతో కాదు.. ప్రేమతోనే ఓడిస్తాం
తమ పోరాట పంథాను వివరిస్తూ.. ద్వేషం, హింసతో ఫాసిస్టు శక్తులను ఎదుర్కోలేమని, అవి తమ సిద్ధాంతాలు కావని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కోపం, ద్వేషం లేకుండా కేవలం ప్రేమ, ఆప్యాయతతోనే వారిని ఎదుర్కొంటామని చెప్పారు. సత్యం, అహింస, ప్రేమ చేతిలోనే వారు ఓడిపోయే రోజు కచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమలాగే ఆలోచిస్తూ ఒకే తరహా ఆర్థిక వ్యవస్థ, ద్వేషపూరిత శక్తులపై పోరాటం చేస్తున్న మిత్రులందరికీ ఆయన స్వాగతం పలికారు. తాము ఎవరినీ ద్వేషించమని, కించపరచమని చెబుతూనే.. దేశంలోని ప్రతి మూల నుంచీ ఫాసిస్టు శక్తులను తరిమికొట్టడమే తమ లక్ష్యమని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Rahul Gandhi : ఫాసిస్టు శక్తులను తరిమికొడతాం.. హైదరాబాద్ వేదికగా రాహుల్ గాంధీ పిలుపు
-
#AA23 బిజినెస్ లెక్కలు.. వైరల్ అవుతున్న బన్నీ, లోకేష్, మైత్రీ డీల్?
-
Vigilance Raids: అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. రూ. 10.43 కోట్ల సరుకు స్వాధీనం..
-
SP-Congress Alliance: 200కు పైగా సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. నవంబర్ 17న అఖిలేశ్‌తో కీలక భేటీ!
-
Mississippi River Accident : మిసిసిపీ నదిలో పెను ప్రమాదం.. క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ట్యాంకర్
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!