Bharat Jodo Yatra: రెండో రోజు హుషారుగా రాహుల్ గాంధీ భారత జోడో పాదయాత్ర సాగుతోంది. కాంగ్రెస్ కు మద్దతుదారులైన సెలబ్రిటీలను ఇందులో భాగంగా చేస్తోంది. తద్వారా రాహుల్ పాదయాత్రకు మరింత ప్రజాదరణ తీసుకురావచ్చన్న వ్యూహం ఇందులో కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే నటి పూనమ్ కౌర్ రాహుల్ తో కలసి తెలంగాణలో కొద్దిదూరం నడిచింది. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోకి బాలీవుడ్ సీనియర్ నటి పూజా భట్ కూడా చేరారు. రాహుల్ తో కలిసి ఆమె కొద్ది దూరం నడిచింది. రాహుల్ యాత్రకు ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు మద్దతుగా ప్రకటనలు చేయడం విశేషం.
Read Also: Engineering student: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
నగరంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్రకు బ్రేక్ పడింది. లంచ్ విరామం తర్వాత మళ్లీ యాత్ర మొదలుకానుంది. మదీనాగూడ సర్కిల్ వద్ద యాత్రకు బ్రేక్ ఇచ్చారు. కిన్నెర హోటల్లో రాహుల్ లంచ్ చేయనున్నారు. ఈ రోజు ఉదయం కూకట్పల్లి, జేఎన్టీయూ మీదుగా రాహుల్ పాదయాత్ర సాగింది. సాయంత్రం 4 గంటలకు బీహెచ్ఈఎల్ బస్ స్టాండ్ నుంచి తిరిగి యాత్ర ప్రారంభంకానుంది. మియాపూర్, రామచంద్ర పురం, పఠాన్‌చెరు వరకు పాదయాత్ర సాగనుంది. సాయంత్రం 7 గంటలకు హరిదోశ ముత్తంగి వద్ద కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. రుద్రారమ్ గణేష్ మందిర్‌లో రాహుల్ గాంధీ నైట్ హాల్ట్ చేయనున్నారు.
हर कोई जुड़ रहा है 'भारत जोड़ो यात्रा' से। विचारधारा की इस पदयात्रा में अब एक्ट्रेस पूजा भट्ट भी हुई शामिल. @PoojaB1972#BharatJodoYatra pic.twitter.com/WKFPifxjDc
— Bharat Jodo (@bharatjodo) November 2, 2022