Engineering student: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. ఆ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న వంశీ పటేల్ పెట్రోల్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మంటల దాటి దాదాపు ఎనభై శాతానికి పైగా శరీరం కాలిపోయింది.
విద్యార్థి పరిస్థితి చూస్తే విషమంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంత జరిగినా విషయాన్ని కళాశాల యాజమాన్యం కప్పి పుచ్చేందుకు ప్రయత్నిస్తోంది. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కారణాలను అడిగితే దాటవేసే ప్రయత్నం చేస్తోంది కాలేజీ బృందం. మాకు ఏం తెలియదంటూ బుకాయిస్తున్నారని సమాచారం. పోలీసులు విషయం తెలుసుకుని సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై ఇంకా పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.
Read Also: Hyderabad: పార్కులకు వెళ్లే లవర్స్‌కు చేదువార్త.. ఆ పని చేస్తే దొరికిపోతారు
Read Also: Mumbai: దాగుడుమూతలు ఆడుతూ 16 ఏళ్ల బాలిక మృతి