NTV Telugu Site icon

Rahul Gandhi: ‘పెళ్లి కోసం అంబానీ కోట్లు ఖర్చుపెట్టారు.. అది మీ డబ్బే’

Rahulgandhi

Rahulgandhi

హర్యానాలో అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీలలో తమ అభ్యర్థుల కోసం అన్ని పార్టీల నేతలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం బహదూర్‌ఘర్‌లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తన కుమారుడి పెళ్లికి కోట్లు ఖర్చు చేశారని, అయితే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు.

READ MORE: Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌‌లో ఏఐఎక్స్‌ కనెక్ట్‌ విలీనం

రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “అంబానీ పెళ్లి చూశారా.. అంబానీ పెళ్లికి కోట్లు ఖర్చుపెట్టారు.. ఇది ఎవరిది.. ఇది మీ డబ్బు.. మీ పిల్లల పెళ్లి కోసం బ్యాంకులో అప్పు తీసుకుంటారు. నరేంద్ర మోడీ ఇలా చేశారు.. ప్రధాని మోడీ దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టారు. ఇంతే కాకుండా.. హర్యానాలో ఉన్న ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. గతంలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 400 ఉండేది. నేడు అది రూ. 1200 ఉంది. హర్యానా రైతులు తమ ధాన్యానికి మద్దతు ధర రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతుల నుంచి వరి కొనుగోలు చేస్తాం” అని ఆయన పేర్కొన్నారు.

READ MORE: Adluri Laxman Kumar : నిర్వాసితుల కష్టాలపైన అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఏ నాడు మాట్లాడలేదు..

హర్యానా ప్రభుత్వంలో నిరుద్యోగం పెరిగిందని.. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. పేదలకు రూ.3.5 లక్షలతో 100 గజాల ప్లాట్, 2 పడక గదుల ఇల్లు, 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు.