Rahul Gandhi: ‘‘ఢిల్లీ ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డంకులు’’.. కేంద్రంపై రాహుల్ ఆరోపణలు..

  • ఢిల్లీకి ప్రజలు రాకుండా అమిత్ షా అడ్డుకుంటున్నారు..
  • రాంలీలా మైదాన్ ర్యాలీ ప్రతిపక్షాల ఉద్యమం..
  • ఓట్లు కోల్పోతున్నామనే బాధ ప్రజల్లో ఉంది..
  • కేంద్రంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు..
Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ప్రతిపక్ష ఇండియా కూటమి నవంబర్ 1న భారీ ర్యాలీని తలపెట్టింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. దాదాపుగా 10 లక్షల మంది ర్యాలీకి హాజరవుతారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వస్తున్న ప్రజల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ ఆరోపణలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, సామాన్య ప్రజలు రాకుండా అడ్డంకులు సృష్టి్స్తున్నారని పేర్కొన్నారు.

రాంలీలా మైదాన్‌లో జరిగే కార్యక్రమానికి ఎంతమంది వస్తారు, వారిలో ఎంతమందిని అడ్డుకుంటున్నారో గమనిస్తే దేశంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో అర్థమవుతుందని ఆయన అన్నారు. కోట్లాది మంది ఓటు హక్కును కోల్పుతున్నారనే ఆవేదన ప్రజల్లో ఉందని, దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని చెప్పారు. అదానీ, అంబానీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లకు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఇది వేర్వేరు నిరసన కార్యక్రమం కాదని, ఒకే ఉద్యమమని ఆయన అన్నారు. మొత్తం ప్రతిపక్షం ఈ పోరాటంలో పాల్గొంటుందని చెప్పారు. నిరసన తెలియజేయాలనుకునే ప్రతీ ఒక్కరూ రాంలీలా మైదాన్‌కు రావచ్చని చెప్పారు.