NTV Telugu Site icon

Rahul Dravid: వరల్డ్కప్లో టీమిండియా విజయ రహస్యాలు చెప్పిన ద్రవిడ్

Dravid

Dravid

వరల్డ్కప్‌ 2023లో భారత్ విజయాలతో దూసుకెళ్తుంది. లీగ్ మ్యాచుల్లో ఆడిన 9 మ్యాచ్ల్లో ఓటమెరుగని జట్టుగా నిలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో జట్టు వరుస విజయాలపై కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణం వివరించాడు. జట్టు తనకు తానుగా ప్రత్యేకంగా ఓ టాస్క్‌ పెట్టుకుందని తెలిపాడు. విజయాల వైపు జట్టును నడిపించేందుకు ఓ స్పెషల్ మిషన్‌ను ఇచ్చినట్టు చెప్పాడు.

Read Also: ‘Pig butchering’ scams: పిగ్ బచ్చరింగ్ స్కామ్ ఎలా జరుగుతుంది? స్కామ్ నుంచి ఎలా రక్షించుకోవాలి?

స్టార్ స్పోర్స్ట్ తో జరిగిన కార్యక్రమంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ కోసం కొన్ని సవాళ్లు సిద్ధం చేసుకున్నాం. తొమ్మిది నగరాల్లో జరిగిన మ్యాచుల్లో అభిమానులు బాగా సపోర్ట్ చేశారు. వీలైనంత బాగా ఆడాలని, మంచి ప్రదర్శన కనబర్చాలని అనుకున్నాం. యువ ఆటగాళ్లు కూడా చక్కగా రాణించారు’’ అని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.

Read Also: Deepika: ముంబై వీధుల్లో క్యాబ్స్ లోనే సూట్‌కేస్‌తో పడుకునేదాన్ని!

ఇదిలా ఉంటే.. సెమీస్‌కు ముందు ఆరు రోజుల విశ్రాంతి దొరకడం, తమకు బాగా కలిసి వచ్చిందని ద్రవిడ్ అన్నాడు. మరోవైపు జట్టులోని ఐదుగురు బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారని, అంతేకాకుండా.. ఇద్దరు ముగ్గురు శతకాలు బాదుతున్నారని కొనియాడాడు. ఇక బౌలింగ్ విభాగంలో కూడా.. మంచిగా రాణిస్తున్నారని చెప్పాడు. మరీ ముఖ్యంగా మిడిలార్డర్ అద్భుతంగా ఆడుతున్నారని ప్రశంసించాడు. టాపార్డర్ లో కూడా పరుగులు వస్తున్నాయని తెలిపాడు. లీడర్‌బోర్డులో రోహిత్, కోహ్లీ పరుగుల సునామీ సృష్టిస్తున్నారని, వారు అద్భుతంగా ఆడుతున్నారని ద్రవిడ్ ప్రశంసించాడు.