ENG vs AFG: ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రహ్మానుల్లా అఫ్గాన్ ఆటగాళ్లు గుర్బాజ్, ఇక్రమ్ అలీఖిల్ రాణించడంతో ఆఫ్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్‌కు 285 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 80 పరుగులతో గుర్బాజ్ స్కోరుతో శుభారంభం చేసింది.
Also Read: Israel: ‘పాలస్తీనా ఒసామా బిన్ లాడెన్’ని చంపేస్తామని ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ..
తర్వాత, ఇక్రమ్ 58 పరుగుల వద్ద రీసీ టాప్లే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వీరితో పాటు ముజీబ్ ఉర్ రెహ్మాన్ కూడా 16 బంతుల్లో 28 పరుగులు చేసి వేగంగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు మార్క్ వుడ్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు.