NTV Telugu Site icon

Mumbai: ఈ హీరోకి చెందిన రూ. 250 కోట్లు భవన నిర్మాణం పూర్తి..

Ranbheer

Ranbheer

బాలీవుడ్ నటీమణులు అలియా భట్, రణబీర్ కపూర్ చాలా కాలంగా ఓ నూతన ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్నారు. పనులు చూసేందుకు తరచూ తమ కూరుతో కలిసి వస్తుండటం చూశాం. తాజాగా ఈ భవనాకి చెందిన పెద్ద వార్త బయటకు వచ్చింది. ముంబైలోని బాంద్రాలో నిర్మిస్తున్న ఈ విలాసవంతమైన బంగ్లా ధర రూ.250 కోట్లు ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. నటుడు రణబీర్ తన కుమార్తె రాహా పేరు మీద రిజిస్టర్ చేసాడు. ప్రస్తుతం బహుళ అంతస్తుల భవన నిర్మాణం పూర్తయింది. ఇది ప్యాలెస్ కంటే తక్కువేం కాదు. పెళ్లయినప్పటి నుంచి ఈ జంట తమ అభిరుచుకులకు అనుగుణంగా దీన్ని నిర్మించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

READ MORE: Harsha Sai : హర్ష సాయి కేసులో ఆర్జే శేఖర్ భాషా అరెస్టు?

భవనం సిద్ధమైన తర్వాత, రణబీర్ – అలియా తమ కుమార్తె రాహాతో కలిసి అందులో నివసించనున్నారు. అయితే వీరిద్దరూ ఈ కొత్త ఇంటికి ఎప్పుడు వస్తారనే విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంటికి సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఈ ఇంటిని చూసిన జనాలు స్పందిస్తున్నారు. ఓ వినియోగదారు “ఒకప్పుడు ఇది ఎల్విష్ హౌస్ లాగా ఉండేది” అని కామెంట్ చేశాడు. ‘వావ్, వాట్ ఎ లవ్లీ బంగ్లా’ అని రాసుకొచ్చాడు. ‘ఇది విలాసంగా లేదు, పూర్తిగా సాధారణమైనదిగా కనిపిస్తుందని ఓ వినియోగదారు అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Show comments