Blood Donation: మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తితోనే..18 ఏళ్లుగా రక్తదానం..! 36 ఏళ్ల వయసులోనే 100 సార్లు రక్తదానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blood Donation: రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చనే సందేశాన్ని ఆచరణలో చూపిస్తున్నారు నంద్యాలకు చెందిన రాగురు ఫణీంద్ర. కేవలం 36 ఏళ్ల వయసులోనే 100 సార్లు రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షుడిగా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయన.. నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో తాజాగా 100వ సారి రక్తదానం చేశారు. చదువుకునే రోజుల నుంచే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా.. అతని స్నేహితులను కూడా సేవ కార్యక్రమాలలో భాగం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఈ సందర్భంగా ఫణీంద్ర మాట్లాడుతూ.. తన 18వ ఏట రక్తదానం చేయడం ప్రారంభించానని, అప్పటి నుంచి గత 18 ఏళ్లుగా క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 100వ సారి రక్తదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చని, రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. తాను తొలిసారిగా 18వ ఏట చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశానని గుర్తు చేసుకుంటూ.. మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తితోనే రక్తదానంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ జర్నీలో తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువు, ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు బాపూజీ నాయక్ మార్గదర్శకత్వం, భార్య విష్ణు గాయత్రి సహకారంతో ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. భవిష్యత్తులో తన పిల్లలను కూడా సేవా మార్గంలో నడిపిస్తానని చెప్పుకొచ్చారు.
Also Read
- Delimitation 2026: డీలిమిటేషన్‌పై విపక్షాల ప్రధాన ఆందోళన ఇదే! అసలు జెర్రీమాండరింగ్ అంటే ఏంటి?
- CM Chandrababu: సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కూటమి ఎంపీలకు కీలక ఆదేశాలు!
- MS Dhoni: '7' నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
- PM Modi AP Tour: తిరుపతిలో ప్రధాని మోడీ పర్యటన.. మూడు రోజుల పాటు బిజీ షెడ్యూల్, భారీ భద్రతా ఏర్పాట్లు!
ఈ సందర్బంగా ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు బాపూజీ నాయక్ మాట్లాడుతూ.. నంద్యాలలో 100వ సారి రక్తదానం చేసిన వ్యక్తిగా ఫణీంద్ర నిలవడం అభినందనీయమన్నారు. తన శిష్యుడిగా సేవా కార్యక్రమాల్లో ముందుంటూ మంచి పేరు తీసుకురావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఫణీంద్రకు 100వ రక్తదానానికి సంబంధించిన షీల్డ్, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఇప్పటివరకు నంద్యాల, కడప, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో సుమారు 40 వేల మందికి పైగా రక్తదాతలను సమకూర్చి, ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు కృషి చేసినట్లు ఫణీంద్ర వెల్లడించారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ద్వారా ఎంతో మందికి ఆకలి తీర్చడం, అలాగే డబ్బులేక చదుకోవడానికి ఇబ్బంది పడుతున్న అనేక మంది నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం, ఇంకా అత్యవసర పరిస్థితులలో ఎవరికైనా రక్తం అవసరమైన వెంటనే స్పందించి.. ఎంతో మందికి రక్తం అందుబాటులోకి తీసుకవచ్చి వారి ప్రాణాలను నిలబెడుతున్నారు. ఈ సమితి నంద్యాల, కడప పట్టణాలలో ఎప్పటికప్పుడు వివిధ సేవ కార్యక్రమాలు చేపడుతూనే ఉంటారు. అలాగే ప్రతిరోజు రెండు పట్టణాలలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు, వారి బంధువులకు అల్పాహారం అందచేస్తారు.
తాజావార్తలు
-
Blood Donation: మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తితోనే..18 ఏళ్లుగా రక్తదానం..! 36 ఏళ్ల వయసులోనే 100 సార్లు రక్తదానం..
-
Delimitation 2026: డీలిమిటేషన్‌పై విపక్షాల ప్రధాన ఆందోళన ఇదే! అసలు జెర్రీమాండరింగ్ అంటే ఏంటి?
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కూటమి ఎంపీలకు కీలక ఆదేశాలు!
-
Shashi Tharoor: 850 మంది ఎంపీలతో లోక్‌సభ నడుస్తుందా?.. చప్పట్లు కొట్టడానికే చాలామంది వస్తారు..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!