Ragi Smoothie Recipe: బరువు తగ్గడానికి, ఎముకల బలానికి బెస్ట్ ఛాయిస్ హెల్తీ ‘రాగి స్మూతీ’!
Ragi Smoothie Recipe: బరువు తగ్గడానికి ఏవేవో డైట్ ప్లాన్ చేస్తుంటారు చాలామంది. అలంటి వారి కోసం ‘రాగి’ పిండితో చేసే వంటకాలు ఎంతో సహకారం అందిస్తాయి. ఇందులో భాగంగా ‘రాగి జావ’ ను తాగమని చాలామంది చెబుతుంటారు. కానీ కొందరికి అది అంటే నచ్చకపోవచ్చు, కానీ అచ్చం అలాగే ఉండే స్మూతీలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ప్రత్యామ్నాయంగా కూడా పనిచేస్తుంది. మరి దీనిని ఎలా చేసేయాలి చూసేద్దామా..
కావలసిన పదార్థాలు:
* రాగి పిండి: ఒకటిన్నర టేబుల్ స్పూన్
* నీళ్లు: ఒక కప్పు
* దాల్చిన చెక్క: చిన్న ముక్క
* బాదం పప్పులు: 10 (నానబెట్టినవి)
* అరటిపండు లేదా ఆపిల్: ఒకటి
* అవిసె గింజలు (Flax Seeds): ఒక టేబుల్ స్పూన్
Also Read
- IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడి ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్‌లో సంచలన విషయాలు
- IPL 2026: వరుస పరాజయాలు.. Mumbai Indians ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఇలా ఆడాల్సిందే.!
- Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
- Ragi Papad Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. "రాగి పాపడాలు" ఈజీగా తయారు చేసుకోండిలా..
Love Marriage: ఆయనకేమో 60, ఆమెకు 28.. కట్ చేస్తే?
తయారీ విధానం:
మొదట ఒకటిన్నర టేబుల్ స్పూన్ల రాగి పిండిలో కొద్దిగా నీళ్లు పోసి, ఉండలు లేకుండా పలుచగా కలిపి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కప్పు నీళ్లు పోసి మరిగించండి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపండి. ఇందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను వేయండి. ఇది స్మూతీకి మంచి రుచిని, వాసనను ఇస్తుంది. ఇలా వేసిన ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించండి. ఆ తర్వాత దాల్చిన చెక్కను తీసేసి ఆ రాగి జావను పూర్తిగా చల్లారనివ్వండి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పొట్టు తీసిన 10 నానబెట్టిన బాదం పప్పులు, ముక్కలు చేసిన అరటిపండు లేదా ఆపిల్, ఒక స్పూన్ అవిసె గింజలు వేయండి. అలాగే అందులోకి చల్లారిన రాగి జావను కూడా జార్లో వేసి మెత్తగా స్మూతీలా మిక్సీ పట్టుకోండి. అంతే ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకుని, పైన మరికొన్ని బాదం ముక్కలతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన రాగి స్మూతీ రెడీ.
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడిగంటలు.. మీనా రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
రాగి స్మూతీ ప్రయోజనాలు:
ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండుగా అనిపించి ఆకలిని తగ్గిస్తుంది. రాగిలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. బాదం, అవిసె గింజలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
తాజావార్తలు
-
IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడి ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్‌లో సంచలన విషయాలు
-
IPL 2026: వరుస పరాజయాలు.. Mumbai Indians ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఇలా ఆడాల్సిందే.!
-
CSK History: సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ఐపీఎల్ చరిత్రలోనే..!
-
Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
-
Ragi Papad Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. “రాగి పాపడాలు” ఈజీగా తయారు చేసుకోండిలా..
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!