Site icon NTV Telugu

Raghuveera Reddy: తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందిస్తున్నా..

Raghuveera Reddy

Raghuveera Reddy

Raghuveera Reddy: తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందిస్తున్నానని సీడబ్ల్యూసీ మెంబర్‌ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. గత పది సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టాల్సి ఉండేదన్నారు. ఆలస్యంగా నైనా ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పజెప్పారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి అక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పని చేయవలసి ఉందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయడంతోనే విజయం సాధించారని ఆయన అన్నారు.

Read Also: GVL Narasimha Rao: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు కారణం అదే.. జీవీఎల్‌ కీలక వ్యాఖ్యలు

కర్ణాటక రాష్ట్రం 5 గ్యారెంటీలు ఎలా పని చేశాయో, తెలంగాణలో 6 గ్యారెంటీలతో ప్రజలు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించారన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఫలితాలను బలంగా తీసుకొని, ఇండియా కూటమిలోని పార్టీలు పనిచేయవలసి ఉందన్నారు. కేంద్రంలో మార్పు రావాల్సి ఉంది.. ఆ దిశగా భారతదేశంలో ప్రజలు పని చేయాలన్నారు. ఉత్తర భారత్‌లో మూడు రాష్టాలలో వచ్చిన ఫలితాలు, కాస్త అసంతృప్తినిచ్చాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలుపొందిన పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కకు రఘువీరా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version