Raghav Chadha: వినియోగదారుల డబ్బుకు విలువ ఎక్కడ? వాడని డేటా ఎక్కడికి పోతుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghav Chadha: రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ప్రస్తావించే ప్రతి అంశం సగటు భారతీయుడు ఆలోచనలకూ చాలా దెగ్గరగా ఉంటుంది. ఇప్పటి అనేక అంశాలపై రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక తాజగా ఆయన రోజువారీ డేటా లిమిట్స్‌తో వచ్చే మొబైల్ రీచార్జ్ ప్లాన్లపై చర్చించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలా టెలికాం సంస్థలు 1.5GB, 2GB లేదా 3GB వంటి రోజువారీ డేటా పరిమితులను అందిస్తున్నాయి. అయితే వినియోగదారులు పూర్తిగా డేటా ఉపయోగించకపోతే, మిగిలిన డేటా అర్ధరాత్రి తర్వాత పూర్తిగా రద్దవుతోంది. ఉదాహరణకు, 2GB ప్లాన్ తీసుకున్న వినియోగదారు 1.5GB మాత్రమే వాడితే, మిగిలిన 0.5GB డేటా పూర్తిగా పోతుంది. దీనికి రిఫండ్ లేదా రోల్‌ఓవర్ వంటి అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య
Also Read
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
ఈ విధానాన్ని విమర్శించిన రాఘవ్ చద్దా.. “డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన డేటా ఎందుకు నష్టపోవాలి?” అని ప్రశ్నించారు. వినియోగదారులకు న్యాయం జరగాలంటే కొన్ని మార్పులు అవసరమని ఆయన సూచించారు. ఇందులో భాగంగా ఆయన పలు డిమాండ్లు ప్రభుత్వం ముందర ఉంచారు.
డేటా రోల్‌ఓవర్ విధానం:
వాడని డేటా తదుపరి రోజుకు తరలేలా అన్ని టెలికాం కంపెనీలు అవకాశం ఇవ్వాలని కోరారు. రోజు ముగిసిన వెంటనే డేటా తొలగించకుండా, తర్వాతి రోజుకి జోడించాలి అన్నారు.
వాడని డేటాకు సర్దుబాటు:
వినియోగదారులు నిరంతరం తక్కువ డేటా వాడితే, మిగిలిన డేటా విలువను తదుపరి రీచార్జ్‌లో తగ్గింపు రూపంలో ఇవ్వాలని సూచించారు.
CM Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్.. 24 వేల కోట్లతో మెట్రో విస్తరణ..!
డేటా ట్రాన్స్‌ఫర్ సౌకర్యం:
వాడని డేటాను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు పంపుకునే విధానం ఉండాలని పేర్కొన్నారు. డేటాను వినియోగదారుల “డిజిటల్ ఆస్తి”గా పరిగణించాలి అన్నారు.
డిజిటల్ ఇండియాలో కీలక అంశం:
డిజిటల్ యుగంలో డేటా అత్యంత కీలకమైన వనరుగా మారింది. ఇలాంటి సమయంలో వినియోగదారులు చెల్లించిన డేటా పూర్తిగా వినియోగించుకునే హక్కు ఉండాలని చద్దా అభిప్రాయపడ్డారు.
Telecom companies offer Recharge Plans with ‘𝐃𝐚𝐢𝐥𝐲 𝐃𝐚𝐭𝐚 𝐋𝐢𝐦𝐢𝐭𝐬’ like 1.5GB, 2GB or 3GB per day, resetting every 24 hours. Any Unused Data EXPIRES at midnight, despite being fully paid for.
𝐘𝐨𝐮 𝐚𝐫𝐞 𝐛𝐢𝐥𝐥𝐞𝐝 𝐟𝐨𝐫 𝟐𝐆𝐁. 𝐘𝐨𝐮 𝐮𝐬𝐞 𝟏.𝟓𝐆𝐁. 𝐓𝐡𝐞… pic.twitter.com/sWiJbKj2AV
— Raghav Chadha (@raghav_chadha) March 23, 2026
తాజావార్తలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్‌హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్‌టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..