మనం వాడే కూరగాయలలో ఒకటి ముల్లంగి.. సాంబార్ లలో ఎక్కువగా వాడుతారు.. ఈ ముల్లంగిని ఆయుర్వేదంలో కూడా వాడుతారు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. రైతులు కూడా ఈ పంటను పండిస్తున్నారు.. ముల్లంగి విత్తిన 30 రోజుల తర్వాత స్వచ్ఛమైన తెల్లటి సన్నని, లేత ముల్లంగి కాండం చేతికందుతుంది. ఈరోజు ముల్లంగి సాగుకు అనువైన విత్తన రకాలు, నేలలు ఏంటో ఒక్కసారి చూద్దాం..
ముల్లంగి విత్తన రకాలు.. పూసా హిమాని, రాపిడ్ రెడ్ వైట్ టిప్డ్, గ్లోబులర్ రకాలు అవి 26 రోజుల్లో కోతకు సిద్ధంగా ఉంటాయి. ఉష్ణమండల రకాలైన జపనీస్ తెలుపు ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు మూలాలు మెరుగ్గా పెరుగుతాయి.. ఇకపోతే వీటిని ఆగస్టు ప్రారంభంలో విత్తడానికి అనుకూలంగా ఉంటాయి. పూసా చెట్కి రకం ఇది కాండం తెల్లగా ఉంటుంది. మార్చి, ఆగస్టు వరకు విత్తడానికి అనుకూలంగా ఉంటాయి. 40 నుండి 45 రోజులలో వేర్లు కోతకు సిద్ధంగా ఉంటాయి. పూస రేష్మి రకం వేర్లు 30 నుండి 35 సెం.మీ పొడవుతో తెల్లగా కుచించుకుపోయి ఆకుపచ్చని కాండం చివర ఉంటుంది… దీన్ని సెప్టెంబర్ – అక్టోబర్ నెలలో విట్టడానికి అనుకూలంగా ఉంటుంది..
ముల్లంగిని అన్ని రకాల నేలల్లో పండిస్తారు, అయితే తేలికైన నేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. ఇసుకతో కూడిన నేలలు, ఆమ్ల నేలల్లో కూడా ముల్లంగిని పండించవచ్చు.. ఇకపోతే ఈ ముల్లంగిని 45 సెం.మీ దూరంలో ఉన్న గట్ల మీద విత్తుతారు. 22 సెం.మీ ఎత్తులో 1.25 సెం.మీ లోతులో ఒక చిన్న గాడిని తయారు చేసి… మెత్తని ఇసుక లేదా ముతక మట్టితో కలిపి చేతితో సాళ్లలో విత్తాలి.. విత్తిన వెంటనే మొదటి నీటిపారుదల, తర్వాత నీటి పారుదలకు వారం రోజులు గ్యాప్ ఉండాలి..
ఇక తెగుళ్ల విషయానికొస్తే.. ముల్లంగి ఆకులు లేతగా, అలాగే మూలాలలో చిన్న ఖాళీలు అలాగే పొడవైన కమ్మీలు కనిపిస్తే అవి మార్గోట్స్ బారిన పడినట్లు గుర్తించాలి. ఈ చిన్న కీటకాలు మొక్కల పక్కనున్న నేలలో గుడ్లు పెడతాయి. వాటిని తొలగించడానికి వ్యవసాయ నిపుణుల సూచనలను పాటించాలి.
ముల్లంగి ఆకులు వడలిపోయి పసుపు రంగులోకి మారితే అఫిడ్ మైకోఫ్లాస్మా వైరస్ వల్ల కలిగే వ్యాధి అని గుర్తించాలి.. ఆ మొక్కకలను వెంటనే పీకి పడెయ్యాలి.. ఇంకేదైనా సందేహాలు ఉంటే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..