NTV Telugu Site icon

Fraud: బోర్డ్ తిప్పేసిన ఓ మార్కెటింగ్ కంపెనీ.. లబోదిబోమంటున్న బాధితులు

Frud

Frud

ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు డలంలోని దుగ్గిరాలపాడు గ్రామంలో 5 కోట్ల రూపాయల మేరకు కుచ్చు టోపీ పెట్టారు. హైదరాబాద్ లో రాథారాం మార్కెటింగ్ కంపెనీ బోర్డ్ తిప్పేసింది. ఇరు రాష్ట్రాల్లో సుమారు 2 వేల కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క దుగ్గిరాలపాడు గ్రామంలోనే దాదాపు 5 కోట్ల రూపాయల వరకూ వసూలు చేశారని గ్రామస్తులు అంటున్నారు. రాథారాం కంపెనీ ఎండీ గుదే రాంబాబు తమ ఊరి వాడేనని నమ్మితే నిండా ముంచేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Skanda : అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీ రిలీజ్ కాబోతున్న స్కంద…?

తమ నుండే కాక తమ బందువుల నుంచి బ్యాంక్ ల నుంచి అప్పులు తెచ్చి లక్షల్లో కంపెనీలో పెట్టుబడులు పెట్టి మోసపోయామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూటికి 2 రూపాయల వడ్డీ ఇస్తామంటూ రాథారాం కంపెనీ పెట్టుబడులు ఆకర్షించారు. గ్రామస్తులలో కొంత మందికి కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చి ఎరవేసిన రాథారాం కంపెనీ ఫౌండర్ మరియు ఎండీ గుదే రాంబాబు మరియు అతని తండ్రి నరసింహారావు.. మండల పరిధిలో సదరు కంపెనీ ఎటువంటి వ్యాపారాలు నిర్వహించకపోయినా స్ధానికులనే నమ్మకంతో పెట్టుబడులు పెట్టిన వైనం నెలకొంది.

Read Also: IND vs NZ: న్యూజిలాండ్తో మ్యాచ్.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

అయితే, ఆగష్టులో కంపెనీ బోర్డ్ తిప్పేయడంతో ఉద్యోగాలు పోయి పెట్టుబడి డబ్బులు వెనక్కి రాక బాధితులు లబోదిబోమంటున్నారు. రాథారాం కంపెనీ ఎండీలు పెనుమత్స కృష్ణంరాజు, గుదే రాంబాబు, గుదే రాంబాబు తండ్రి నరసింహారావు మమ్మల్ని మోసం చేశారు ఆదుకోండంటూ అని బాధితులు వేడుకుంటున్నారు. రాథారాం కంపెనీలో ఎండీగా వ్యవహరిస్తున్న దుగ్గిరాలపాడు వాసి గుదే రాంబాబు ఇంటి దగ్గర నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.