NTV Telugu Site icon

CP Sudheer Babu : పసి బిడ్డలను అమ్ముకుంటున్న ముఠా అరెస్ట్

Cp Sudheer Babu

Cp Sudheer Babu

CP Sudheer Babu : రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు అంతర్జాతీయ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను ఛేదించి సంచలనం రేపారు. గుజరాత్‌లో జన్మించిన పసి పిల్లలను అక్రమంగా హైదరాబాద్‌కు తరలించి అమ్మకాల యత్నం చేస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా సభ్యులు ఆడ శిశువులను రూ. 2.5 లక్షలకు, మగ శిశువులను రూ. 4.5 లక్షలకు విక్రయిస్తుండగా, పోలీసుల దాడిలో వారి పథకం భగ్నమైంది. దీనికి సంబంధించిన సమాచారం ముందస్తుగా అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ (SOT) మరియు చైతన్యపురి పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Graduate MLC: ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక.. సాయంత్రం ప్రచారానికి తెర

రాచకొండ పోలీసు కమిషనర్ జి. సుధీర్ బాబు మాట్లాడుతూ, మొత్తం 11 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంతేగాక, ఈ అక్రమ కార్యకలాపంలో పాల్పడిన ముఠా సభ్యులే కాకుండా, కొనుగోలు చేసిన దంపతులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ ముఠా గుజరాత్‌లో పిల్లలను ఎలాంటి పద్ధతిలో సేకరించింది? వారిని నేరుగా కిడ్నాప్ చేశారా? లేక వేరే మార్గాల్లో కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలించారా? అనే ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు ప్రత్యేక బృందాన్ని గుజరాత్ పంపనున్నట్లు సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుండగా, రాచకొండ పోలీసులు చైల్డ్ ట్రాఫికింగ్ పై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిద్ధమవుతున్నారు.

AAI Recruitment 2025: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో అసిస్టెంట్ జాబ్స్.. మీరూ ట్రై చేయండి