AAI Recruitment 2025: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో అసిస్టెంట్ జాబ్స్.. మీరూ ట్రై చేయండి
- ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో అసిస్టెంట్ జాబ్స్
- రూ. 1,10,000 వరకు జీతం
- మార్చి 24 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. భారీ వేతనంతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వెస్ట్రన్ రీజియన్ పరిధిలోని నాన్-ఎగ్జిక్యూటివ్ (సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 206 పోస్టులను భర్తీచేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష) 2, సీనియర్ అసిస్టెంట్ (ఆపరేషన్స్) 4, సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) 21, సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) 11, జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్) 168 పోస్టులున్నాయి.
Also Read:Viral Video: అంతరిక్షంలో బట్టలు ఎలా ధరిస్తారో తెలుసా? ఈ వీడియో చూడండి..
Also Read
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు సంబంధిత రంగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్) పోస్టులకు పోటీపడే వారు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అభ్యర్థులు మార్చి 24, 2025 నాటికి గరిష్టంగా 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఈ పోస్టులకు రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ. 36,000 – రూ. 1,10,000 వరకు జీతం అందిస్తారు.
Also Read:MK Stalin: ‘‘దక్షిణాదిపై కేంద్రం కత్తి’’.. డీలిమిటేషన్, హిందీపై స్టాలిన్ ఫైర్..
జూనియర్ అసిస్టెంట్ కు నెలకు రూ. 31,000 – రూ. 92,000 జీతం ఉంటుంది. జనరల్, OBC (NCL), EWS, మాజీ అగ్నివీర్ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ. 1,000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST, PwBD, మాజీ సైనికులు, AAIలో ఒక సంవత్సరం శిక్షణ పూర్తి చేసిన అప్రెంటిస్‌లు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు మార్చి 24 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!