సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. సోషల్ మీడియాలో అపరిచితు వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలని రాచకొండ కమిసనర్ డిఎస్ చౌహాన్ యువతకు సూచించారు. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో వివిధ రకాల అవసరాలకు ఎన్నో రకాల సాంకేతిక పరికరాలు ఉపయోగించడం జరుగుతుందని.. వాటి వల్ల పలు రకాల మార్గాల్లో జరిగే నేరాల వల్ల ఎంతో మంది బాధితులు నష్టపోతున్నారని కమిషనర్ చౌహాన్ తెలిపారు.
Also Read : Pawan Kalyan Vs Perni Nani Live: పవన్ కళ్యాణ్ వర్సెస్ పేర్ని నాని
రాచకొండ కమిషనరేట్ మరియు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని గురునానక్ విద్యా సంస్థలలో సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో రాచకొండ సీపీ దేవేందర్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను సురక్షితంగా ఉంచుకోవాలని, సరైన సెక్యూరిటీ లేని ప్రదేశాల్లో అటూ వంటి కార్డులు వీలైనంత వరకు ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లాటరీలో డబ్బు గెలుచుకున్నారని వచ్చే మోసపూరిత, ఫోన్ కాల్స్ మరియు మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Also Read : Rishabh Pant : వేగంగా కోలుకుంటున్న రిషబ్.. స్విమ్మింగ్ పుల్ లో హల్ చల్
ముఖ్యంగా సోషల్ మీడియాలో యువత అజాగ్రత్తగా ఉండడం వల్ల.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారని సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. మీకు సోషల్ మీడియాలో ఎటువంటి వేధింపులు ఎదురైనా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలి.. మీకు తగిన న్యాయం పోలీసులు చేస్తారని తెలిపారు. అవసరమైన పక్ష్లో పోలీసుల వివరాలు గోప్యంగా ఉంచుతారని ఆయన వెల్లడించారు. సైబర్ క్రైమ్ పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ 1930ను సంప్రదించడం ద్వారా సైబర్ నేరాల మీద ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ అనురాధ ఐపీఎస్ సైబర్ క్రైమ్స్, డీసీపీ రోడ్ సేప్టీ శ్రీ బాలదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు.