NTV Telugu Site icon

Darling – Nabha Natesh : సోలో ట్రావెలింగ్ చేస్తూ ‘రాహి రే’ అంటున్న న‌భా న‌టేష్‌..

Darling Raahi Re Song Promo

Darling Raahi Re Song Promo

Darling – Nabha Natesh : ప్రియదర్శి మరోసారి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ” డార్లింగ్ “. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అశ్విన్ రామ్ ఈ సినిమాను డైరెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియదర్శి సరసన అందాల భామ నబా నటేష్ హీరోయిన్గా జతకట్టింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పోస్టర్స్, ఫస్ట్ లిరికల్ సాంగ్ కు సంబంధించి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి లభించింది. అయితే ఈ సినిమాలోని రెండో లిరికల్ పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.

Brahmaji : మీ అరిగిపోయిన చెప్పులు ఇస్తే ముద్దు పెట్టుకొంటాను..

” రాహి రే ” అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ సంబంధించి ప్రోమో చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో హీరోయిన్ సోలో ట్రావెలింగ్ నేపథ్యంలో ఉండనుంది. ఈ పాటకు సంబంధించిన పూర్తి లిరికల్ వీడియోను మంగళవారం ఉదయం 11:07 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈ సినిమా పూర్తిగా కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తుండగా, నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో అనన్య నాగ‌ళ్ల‌, మొయిన్, శివా రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్, క‌ళ్యాణీ రాజ్ లాంటి నటీనటులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.

Bharateeyudu 2 : భారతీయుడు 2 నుండి వావ్.. అనేలా “క్యాలెండర్ సాంగ్”

Show comments