Bharateeyudu 2 : అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్ పై యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో సుభాస్కరన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. జూలై 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ లెవల్లో ప్రెకషకులకు ముందుకి రాబోతుంది. ప్రస్తుతం సినిమా యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదివరకే విడుదలైన పాటలు, ఇండియన్ 2 ఇంట్రో గ్లింప్స్, ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాల ను క్రియేట్ చేసింది.
T20 World Cup 2024 Final : వామ్మో..మ్యాచ్ రోజు జనాలు తెగ తినేశారు..తాగేశారు..
28 ఏళ్ల క్రితం భారతీయుడు చిత్రంతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసిన కమల్ హాసన్ మరోసారి శంకర్ కాంబోలో వస్తోన్న భారీ బడ్జెట్ సినిమా ‘భారతీయుడు 2’. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామని సినీ అభిమానులలో ఆసక్తి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే మూవీ మేకర్స్ సోమవారం సినిమా నుంచి ‘క్యాలెండర్’ సాంగ్ ను విడుదల చేశారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమంటే.. ప్రముఖ దక్షిణాఫ్రికా మోడల్, 2017లో మిస్ యూనివర్స్ విజేత డెమి-లీ టెబో ఈ పాటలో నటించింది. పాటలోని ప్రతి సన్నివేశాన్ని గ్లామర్ గానే కాదు.. వావ్ అనిపించేంత గొప్పగా చిత్రీకరించారని పాటను చూస్తుంటేనే అర్థమవుతుంది.
Akhil – Agent : టీవీ ప్రీమియర్ కి రెడీ అయిపోయిన అఖిల్ “ఏజెంట్”.. కాకపోతే..
‘‘పాలపుంతల్లో వాలి- జంట మేఘాల్లో తేలి
భూమితో పని లేకుండా- గడిపేద్దామా!
వెన్నెల మాటలు కొన్ని- చుక్కల ముద్దులు కొన్ని
దేవుడి నవ్వులు కొన్ని కలిపేద్దామా!..’’ అంటూ చిన్నది కొంటెగా పాడితే మగవాడు మామూలుగా ఉండగలడా..! అసలు తన అంద చందాల గురించి ఇంత అందంగా వన్నెంచి చిన్నది ఎవరు.. ఎవరితో ఆడి పాడుతుందనే విషయాలు తెలియాలంటే మాత్రం ‘భారతీయుడు 2’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మూవీ మేకర్స్. ఇంకెందుకు ఆలస్యం పాటపై ఓ లుక్ వేయండి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.