R Ashwin: నాకు చాలా బాధ అనిపించింది.. కానీ ఏం చేయలేం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా మరోసారి రన్నరప్‌కే పరిమితమైంది. డబ్ల్యూటీసీ 2021-23 విజేతగా ఆస్ట్రేలియా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఫైనల్లో టీమిండియాపై 209 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా సగర్వంగా టైటిల్‌ను అందుకుంది. అయితే టెస్టుల్లో వరల్డ్ నెంబర్‌వన్ బౌలర్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌ను టీమిండియా తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించిన విషయం. అయితే అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను అదనపు పేసర్‌గా తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై సర్వాత్రా విమర్శలు వచ్చినప్పటికి మ్యాచ్ ముగిసేవరకు ఆర్. అశ్విన్ మాత్రం స్పందించలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన అనంతరం అశ్విన్ ఎట్టకేలకు రియాక్ట్ అయ్యాడు.
Also Read : Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు వివాదం.. ఐఏఎస్ అధికారి నోటీసుకు రేవంత్ రియాక్షన్
Also Read
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
- Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
- Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
ట్విటర్ ద్వారా స్పందించిన అశ్విన్ ముందుగా ఆస్ట్రేలియాకు శుభాకాంక్షలు చెప్పాడు. డబ్ల్యూటీసీ టైటిల్ సాధించిన పాట్ కమిన్స్ సేనకు కంగ్రాట్స్.. ఈ విజయానికి వారు అర్హులు.. నన్ను ఎంపిక చేయకపోవడంపై పెద్దగా బాధ లేదు.. ఎందుకంటే జట్టులోకి ఎంత కష్టపడినా 11 మందికి మాత్రమే అవకాశం దక్కుతుంది అని అన్నాడు. వికెట్ పేసర్లకు అనుకూలంగా ఉండడంతో ఒక స్పిన్నర్ చాలనుకొని జడేజాను ఆడించారు.. కానీ టీమిండియా ఓటమి నాకు తీవ్రంగా బాధ కలిగించింది అని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు.
Also Read : Ruthuraj Gaikwad: చెన్నై ప్రజలకు ఎంగేజ్మెంట్ ను అంకితం చేసిన సీఎస్కే ఓపెనర్
మన జట్టులో కొన్ని లోపాలున్నప్పటికి గెలవడానికి ప్రయత్నించిన తీరు బాగుందని అశ్విన్ అన్నాడు. రెండేళ్లు కష్టపడితే డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు వచ్చాం.. ఇలా ఆఖరి మెట్టుపై బోల్తా పడడం కొద్దిగా బాధనే కలిగిస్తుంది కదా.. ఇంకో విషయం ఏంటంటే.. ఈ రెండేళ్లలో నాతో పాటు ఎన్నో టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు.. ముఖ్యంగా కోచింగ్, సపోర్ట్ స్టాఫ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.. త్వరలోనే మీ ముందుకు వస్తానంటూ ఆర్. అశ్విన్ తెలిపాడు.
Also Read : Cholesterol Control Tips : కొవ్వును వెన్నలా కరిగించే ఆయుర్వేద మూలికలు..
ఇక డబ్ల్యూటీసీ 2021-23లో టీమిండియా తరపున అశ్విన్ అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. ఈ ప్రయాణంలో అశ్విన్ మొత్తంగా 61 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ అదే డబ్ల్యూటీసీ ఫైనల్లో మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. ఒకవేళ అశ్విన్ ఫైనల్ ఆడి ఉంటే టీమిండియా పరిస్థితి మరోలా ఉండేదేమో అని టీమిండియా క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.
Congratulations Australia on winning this #WTCFinal and closing out this cycle of test cricket. It is disappointing to end up on the wrong side of things, nevertheless it was a great effort over the last 2 years or so to get here in the first place.
Amidst all the chaos and…
— Ashwin 🇮🇳 (@ashwinravi99) June 11, 2023
తాజావార్తలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!