అతిగా తింటే బాడిలో కొవ్వు పేరుకుపోతుంది.. దాంతో అధిక బరువు సమస్య ఏర్పడుతుంది.. ఈ రోజుల్లో ఎక్కువ మంది అధిక బరువుతో భాధపడుతున్నారు.. మనం తీసుకొనే ఆహారాన్ని బట్టి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది..శరీరంలో లివర్ కొలెస్ట్రాల్‌ను తయారు చేస్తుంది. సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కుగా ఉంటుంది. శరీరంలో హార్మోన్లు, విటమిన్లు, కొత్త కణాలు ఉత్పత్తి చేయడానికి, విటమిన్ డి సంశ్లేషణకు కొలెస్ట్రాల్ తోడ్పడుతుంది.. అయితే, శరీరంలో కొవ్వు పెరిగితేనే అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి..అందుకే కొవ్వులను కరిగించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కానీ అనుకున్న ఫలితం ఉండదు.. అందుకే మీకోసం ఆయుర్వేద చిట్కాలను తీసుకొచ్చాం.. అవేంటో ఒకసారి చూద్దాం..
ముందుగా ధనియాలు.. సహజంగా మూత్రవిసర్జనకు తోడ్పడతాయి. ఇవి శరీరంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలను.. మూత్రం ద్వారా తొలగిస్తాయి. ఇవి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. ధనియాలు రక్తంలో పేరుకున్న కొలెస్ట్రాల్‌ను ఇట్టే కరిగిస్తుంది.. అందుకే రోజు ఉదయం ఈ టీని తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు..
వెల్లులికి రక్తంలో కొలెస్ట్రాల్ కరిగించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు… ముఖ్యంగా ఇది ఫ్రీ రాడికల్స్, అవి శరీరంలో కలిగించే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యకు అధిక ఆక్సీకరణ ఒత్తిడి కూడా ప్రధాన కారణం. రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే ఒంట్లో కొవ్వు మంచులా కరిగిపోతుంది..
తులసి ఆకు కూడా కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.. అందుకే రోజుకు రెండు, మూడు ఆకులను నమిలి మింగితే గొంతు, ఉదర సమస్యలు కూడా తగ్గుతాయి.. అందుకే దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతారు. గుగ్గిలం పూజలో దూపంలో వెయ్యడానికి వాడతారు.. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. ఇవన్నీ కూడా కొవ్వును వెంటనే కరిగిస్తాయి.. అన్నిటికన్నా ముఖ్యంగా నీళ్లను ఎక్కువగా తీసుకోవాలి.. అరగంట అలా వాకింగ్ చెయ్యడం, యోగా, వ్యాయామాలు కూడా చెయ్యడం మంచిది..