Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: కూటమి మేనిఫెస్టోపై మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదు?

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: కూటమి మేనిఫెస్టో మమ్మల్ని అనుకరించినట్లుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. కూటమి మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నవరత్నాలకు మాత్రమే జనం ఆకర్షితులు కాలేదని.. జగన్ జర్నీని ప్రజలంతా గమనించారన్నారు. 2019లో జగన్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో నమ్మకం కుదిరిందన్నారు. చెప్పింది చేస్తారన్న నమ్మకం ప్రజల్లో కుదరాలన్నారు. సీపీఎస్‌ను ఇప్పటికీ వదిలేయలేదన్నారు. ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, సీపీఎస్‌ విషయంలో మేమే ఒప్పుకుంటున్నామన్నారు. అందుకే 99 శాతం హామీలను నెరవేర్చామని చెబుతున్నామన్నారు. జస్ట్‌ మాట చెప్పడమే అయితే ఇంకా లక్ష కోట్లు ప్రకటించుకోవచ్చన్నారు. కేంద్రంతో గొడవలు వద్దన్నదే మా ఆలోచన అని ఆయన తెలిపారు. 2014లో రుణమాఫీ చేస్తామని చెప్పుంటే ఆ రోజే అధికారంలోకి వచ్చేవాళ్లమన్నారు. ఏం చేయగలమో అదే చెప్పాం, చెబుతున్నామన్నారు. మాది రిస్క్ కాదు, ప్రజలపై నమ్మకమన్నారు. జగన్‌పై ప్రజలకు, ప్రజలపై జగన్‌కు ఉన్న నమ్మకం గెలిపిస్తుందన్నారు. పింఛన్ల విషయంలోనూ విడతల వారీగా పెంచుతున్నామని క్లియర్‌గా చెప్పామన్నారు. ఉన్నంతలో పర్‌ఫెక్ట్‌ టీమ్‌ను పెట్టామని.. ఎవరినో ఒకరిని నిలబెట్టి ఓటు వెయ్యమని అడగలేమని సజ్జల తెలిపారు.

Read Also: Perni Nani: కూటమి మేనిఫెస్టోపై పేర్ని నాని సెటైర్లు

రైతు భరోసా విషయంలో ఒక ప్రణాళిక పెట్టుకున్నాం.. రైతుభరోసా కేంద్రాలు కూడా అన్నదాతల కోసమే.. ఓట్ల కోసమే అనుకుంటే రైతు రుణమాఫీ కూడా చెప్పేవాళ్లం.. సొంతకాళ్లపై రైతులు నిలబడాలన్నదే మా తాపత్రయమని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. విద్య, వైద్యంపై పూర్తిగా ఫోకస్‌ పెట్టామని ఆయన చెప్పారు. అప్పులు చేసి శ్రీలంకను చేశారన్న వ్యక్తి ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో సంపద సృష్టి జరగలేదన్నారు. చంద్రబాబు అనుకున్న రాజధాని ఎందుకు కట్టలేదని అడిగారు. జగన్‌ అధికారంలోకి వచ్చాకే విజయవాడలో ఫ్లైఓవర్ పూర్తి చేయాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు వర్చువల్‌గా తప్ప రియల్‌గా ఏదైనా చేశారా అని ప్రశ్నించారు. ఆయన సంపద పెంచుకున్నారు తప్ప, సంపద సృష్టి జరగలేదన్నారు. కూటమి మేనిఫెస్టోపై మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని అడిగారు. బీజేపీ నేత కనీసం మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదన్నారు. 2014లో మోడీ ఫోటో పెట్టారు కదా.. ఇప్పుడేమైందన్నారు.

Read Also: Narendra Modi : కాంగ్రెస్‌ మళ్లీ పాతరోజులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది

ధాన్యం సేకరణలో గన్నీ బ్యాగ్స్, లేబర్స్‌ ఛార్జీలు ఇస్తున్నామని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఇవి చేయడం బాధ్యత అని జగన్ అనుకుంటారని ఆయన వెల్లడించారు. కానీ చంద్రబాబు దానికి అందమైన పేరు పెట్టి స్కీమ్ అని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. కొవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమాన్ని ఆపలేదన్నారు. 40 నుంచి 45 శాతం వైసీపీకి కోర్‌ ఓటు బ్యాంకు ఉందన్నారు. బస్సు ఛార్జీలు పెంచలేదని, కరెంట్‌ ఛార్జీలు తప్పనిసరిగా పెంచాల్సి వచ్చిందని చెప్పారు. ల్యాండ్‌ టైటిలింగ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏదైనా భూమిని ప్రభుత్వం కబ్జా చేయడానికి కుదురుతుందా అని ప్రశ్నించారు. ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ మేము తయారు చేసింది కాదన్నారు. కేంద్రం తయారు చేసి పంపించిందన్నారు. ఈ యాక్ట్‌పై అపోహలు సృష్టిస్తున్నారన్నారు. 30 వేల మంది మాయమయ్యారని అన్నారు, వివరాలు అడిగితే చెప్పలేదని సజ్జల తెలిపారు. చంద్రబాబు ఎప్పుడు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేదన్నారు. రూ.14 లక్షల కోట్ల అప్పుందని చెబుతున్నారు.. మరి వారు అధికారంలోకి వస్తే హామీలను ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. సచివాలయం తాకట్టు అన్నది అబద్ధమన్నారు.

 

Exit mobile version