NTV Telugu Site icon

PM Modi: ఖతార్ అమీర్‌కు ఆలింగనంతో స్వాగతం పలికిన ప్రధాని మోడీ.. (వీడియో)

Pm Modi

Pm Modi

రెండు రోజుల భారతదేశ పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం విమానాశ్రయానికి వెళ్లి అరుదైన ఆతిథ్యాన్ని అందించారు. ఖతార్ అమీర్‌ను ప్రధాని మోడీ ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. కాగా.. మంగళవారం అమీర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. అనంతరం ప్రధాన మంత్రి మోడీతో చర్చలు జరపనున్నారు.

Read Also: Champions Trophy 2025: పాకిస్తాన్‌లో భారత జెండా వివాదంపై పీసీబీ వివరణ..

ప్రధాన మంత్రి మోడీ ఆహ్వానం మేరకు ఖతార్ అమీర్ భారత్ పర్యటనకు వచ్చారు. ఖతార్ అమీర్ ఇండియాలో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో 2015 మార్చిలో భారతదేశాన్ని సందర్శించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. భారత్-ఖతార్ మధ్య స్నేహం, నమ్మకం, గౌరవంతో కూడిన దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో వాణిజ్యం, పెట్టుబడులు, శక్తి, సాంకేతికత, సంస్కృతి, ప్రజల మధ్య మార్పిడి వంటి రంగాలలో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పెరిగాయి.

Read Also: Mallesham Director: మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా?

కాగా.. ఖతార్ అమీర్ పర్యటన “మా పెరుగుతున్న బహుముఖ భాగస్వామ్యానికి మరింత ఊపునిస్తుంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పేర్కొంది. ఖతార్‌లో ఉండే భారతీయులు అక్కడ అతిపెద్ద ప్రవాస సమాజం. ఖతార్ పురోగతి, అభివృద్ధికి వారు సానుకూలంగా సహకరిస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.