NTV Telugu Site icon

PM Modi: ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక విందు..

Modi

Modi

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం రష్యా వెళ్లారు. ఈరోజు మాస్కోలో ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ కానున్న ప్రధాని, ఆయనతో పలు అంశాలపై చర్చించనున్నారు. దాదాపు ఐదేళ్లలో ప్రధాని మోదీ రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. మోడీ సాయంత్రం 5.30 గంటలకు మాస్కోలోని వ్నుకోవో-II అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఆ తర్వాత ప్రధాని తన హోటల్‌కి వెళ్తాడు.. అక్కడ రష్యా కళాకారులు మోడీకి స్వాగతం పలికేందుకు గార్బాను ప్రదర్శించనున్నారు. అనంతరం సాయంత్రం పుతిన్‌ ఇచ్చే స్పెషల్ విందుకు మోడీ హాజరవుతారు.

Read Also: AP TET 2024: టెట్ కొత్త షెడ్యూల్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..?

22వ భారత్-రష్యా ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ప్రధాని ఈరోజు, రేపు రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఇరువురు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులపైనా ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ పర్యటనలో రష్యా-ఉక్రెయిన్ వివాదంపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. రెండు దేశాల నుంచి శాంతి కోసం భారత్ పదే పదే విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే.. రేపు మాస్కోలోని కేంద్రీయ విద్యాలయ నుండి 100 మంది భారతీయ సంతతి విద్యార్థులతో ప్రధాని మోడీ సంభాషించనున్నారు. అలాగే.. మాస్కోలోని ఎగ్జిబిషన్ వేదిక వద్ద రోసాటమ్ పెవిలియన్‌ను మోడీ సందర్శిస్తారు.

Read Also: Supreme Court: “పీరియడ్ లీవ్” పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించిన సుప్రీం..