Pushpa 2 : “పుష్ప 2” ట్రైలర్.. ఫినిషింగ్ మోడ్ లో చిత్ర యూనిట్ ?
- పుష్ప 2 ట్రైలర్ రెడీ
- డబ్బింగ్ పూర్తి చేసిన అల్లు అర్జున్
- నవంబర్ మధ్యలో రిలీజ్ చేసే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్ పుష్ప 2 నంబర్ 1 ప్లేసులో ఉంది. ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పుష్ప రాజ్ రెడీ అవుతున్నాడు. నిజానికి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం రిలీజ్ అవుతున్నప్పుడు ఈ సినిమా ఈ రేంజ్ లో హిట్ అవుతుందని టీం తప్ప బయట వాళ్లు ఎవరూ ఊహించి ఉండరు. కానీ రిలీజ్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా భారీగా కలెక్షన్స్ వచ్చాయి. దానికి తోడు ఊహించని విధంగా హిందీ బెల్ట్ లో సినిమా గట్టిగా నడిచింది. అల్లు అర్జున్ ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ తీసుకురావడమే.. కాక తెలుగు సినిమాకి మరొక బ్లాక్ బస్టర్ హిట్ అందేలా చేసింది. అయితే ఈ దెబ్బతో ఇప్పుడు పుష్ప 2 మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది టీం. రీ షుట్‌లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది కానీ నిర్మాతలు అవేమీ లేదంటున్నారు. మొత్తం మీద ఒక రకంగా సుకుమార్ ఈ పుష్ప 2 సినిమాను జక్కన్న చెక్కినట్టే చెక్కుతున్నాడు.
Read Also:Bank of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. వివరాలు ఇలా
Also Read
- Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
- Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
ఎక్కడ సీన్ కాస్త అనుమానం వచ్చినా దాన్ని మార్చేస్తూ సినిమాని ఒక అద్భుతమైన ఘట్టంగా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో పోటీ పడడానికి మరే సినిమాలు సాహసం చేయడం లేదు. తాజాగా ఈ సినిమాతో పోటీ పడలేక విక్కీ కౌశల్ హీరోగా నటించిన చావా సినిమా వెనక్కి తగ్గబోతుంది. కేవలం ఆ సినిమా మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా పుష్పా 2 రిలీజ్ అవుతుందంటే అదేదో డైరెక్ట్ సినిమా లాగానే ఇతర సినిమాలను పక్కన పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కాగా ఈ సినిమా రికార్డు బిజినెస్ ని చేస్తుండగా ఇపుడు సినిమా దాదాపు ఫైనల్ అయిపోయే స్టేజీలోకి వచ్చేసింది. ఇంకా స్పెషల్ సాంగ్ బ్యాలన్స్ ఉండగా ఈ సినిమా నుంచి నెక్స్ట్ ఏ టీజర్ లాంటిది లేకుండా డైరెక్ట్ ట్రైలర్ మాత్రమే వస్తుందని ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. అయితే ఈ ట్రైలర్ పై ఇపుడు ఆసక్తికర వార్త తెలుస్తుంది. ప్రస్తుతం ట్రైలర్ డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవలే అల్లు అర్జున్ కూడా ట్రైలర్ సహా సినిమా డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసేశాడట. ఇందులో భాగంగానే ట్రైలర్ డబ్బింగ్ కూడా పూర్తి కానున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ ట్రైలర్ ని నవంబర్ మధ్యలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ట్రైలర్ వచ్చాక పుష్ప 2 పై అంచనాలు ఎక్కడ వరకు వెళ్తాయో చూడాలి.
Read Also:Telangana TET Notification: నేడు టెట్ నోటిఫికేషన్… జాబ్ కేలండర్ ప్రకారం నిర్వహణ..
తాజావార్తలు
-
Chiranjeevi : అది నా గొప్పతనం కాదు, నేను చేసింది ఏమీ లేదు!
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!