Pushpa Mass Jaathara Begins Today: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప-2’. 2021లో రిలీజ్ అయిన ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప-ది రూల్’ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. పుష్ప 2 చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. పుష్ప 2 నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అందరిలో భారీ అంచనాలు పెంచేశాయి.
పుష్ప 2 గురించి ఈరోజు బిగ్ అప్డేట్ ఇస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. ‘పుష్ప మాస్ జాతర ఈరోజు ప్రారంభమవుతుంది. అందరూ ఎదురుచూస్తున్న ఓ అప్డేట్ ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15న పుష్ప 2 గ్రాండ్ రిలీజ్ అవుతుంది’ అని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ప్రస్తుతం పుష్ప మాస్ జాతర, పుష్ప-ది రూల్, పుష్ప 2 టీజర్ ట్రెండ్ అవుతున్నాయి.
Also Read: Mumbai Indians: ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కు ‘అతడు’ కావాలి: గవాస్కర్
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే ఉంది. ఆ రోజున పుష్ప-2కు సంబంధించి రిలీజ్ అయ్యే అప్డేట్‌ను ఈరోజు ఇస్తారని ఫాన్స్ అందరూ అనుకుంటున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా పుష్ప 2 టీజర్ వస్తుందని టాక్. ఈ అవైటెడ్ అప్డేట్ మరికొన్ని గంటల్లో రివీల్ కానుంది. అభిమానులు పుష్ప 2 అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
#PushpaMassJaathara begins today 🔥🔥
Most awaited announcement today at 4:05 PM 💥💥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries @PushpaMovie
— Mythri Movie Makers (@MythriOfficial) April 2, 2024