ఏఆర్ రెహమాన్ అల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ఓన్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్. తక్కువ టైంలో స్టార్ కంపోజర్‌గా మారాడు జీవీ. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీదన్నాడు. అమరన్, లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్స్‌తో జీవీ ప్రకాష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అమరన్ హిట్టుకు కథ ఎంత బలమైనదో మ్యూజిక్ కూడా అంతే కీ రోల్ ప్లే చేసింది. ఇక కమల్ హాసన్ అంబరీవ్ దర్శకత్వంలో మూవీ కోసం జీవీ ప్రకాష్‌ను సెలక్ట్ చేసినట్లు కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ రిలీజ్ మూవీస్, వెబ్ సిరిస్ లు ఇవే
హీరోగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు జీవీ ప్రకాష్. తమిళంలోనే కాదు తెలుగులోనూ ఫోకస్ చేశాడు. ఈ ఏడాది లక్కీ భాస్కర్, మట్కా చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. అలాగే క్రిస్మస్ కానుకగా వస్తున్న నితిన్ రాబిన్ హుడ్ కు జీవీ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇవే కాకుండా ధనుష్ ఇడ్లీ కడాయ్, విక్రమ్ వీర ధూర శూరన్, రెండు బాలీవుడ్ మూవీస్ మరికొన్ని సినిమాలు జీవీ ప్రకాష్ చేతిలో ఉన్నాయి. అలాగే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ బీజీఎం వర్క్ కూడా జీవినే చేస్తున్నాడు. ఇలా వరుస పెట్టి బిగ్ స్టార్ల సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు జీవీ ప్రకాష్. అనిరుధ్, దేవిశ్రీ, తమన్ వీరంతా వర్క్ త్వరగా ఫినిష్ చేయరని, జీవీ అలా కాదని అనుకున్న టైమ్ కి పక్కగా ఇచ్చేస్తాడని, దర్శకులకు అందుబాటులో ఉంటాడని పేరు ఉంది.