ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. మరికొన్ని రోజుల్లో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పుష్ప బ్లాక్ బస్టర్ అవ్వడంతో ముందు నుంచే పుష్ప 2పై భారీ హైప్ నెలకొనగా.. ఇటీవల విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ఆ అంచనాలు తారాస్థాయికి చేర్చాయి. ఇక సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అభిమానులలో మరింత క్యూరియాసిటిని పెంచేలా.. చిత్ర యూనిట్ వరుస ఈవెంట్స్ ప్లాన్ చేసింది.
చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా పుష్ప 2 ప్రమోషన్స్ చేస్తోంది. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చిలో ప్రమోషన్స్ పూర్తయ్యాయి. నేడు ముంబైలో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జేడబ్ల్యూ మారియట్ సహర్ హోటల్లో జరిగే ప్రెస్ మీట్‌కు అల్లు అర్జున్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘మేరీ జాన్ ముంబై.. ఇండియన్ సినిమా ‘కింగ్’ వస్తున్నాడు’ అని ట్వీట్ చేసింది. ‘గెట్ రెడీ ముంబై.. పుష్ప రాజ్ వస్తున్నాడు’, ‘ముంబై సిద్దమా.. కింగ్ వస్తోంది’, ‘ముంబై కాచుకో’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక మందన్న, సుకుమార్ కూడా ముంబైలో సందడి చేయనున్నారు.
Also Read: Allu Arjun: మై స్వీట్ బ్రదర్.. నీ ప్రేమకు ధన్యవాదాలు!
ఒక్కప్పుడు ఇండియన్ ఇండస్ట్రీని బూలీవుడ్ ఎలగా.. ఇప్పుడు టాలీవుడ్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, సలార్, కల్కిలు ప్రభంజనం సృష్టించాయి. అందుకే ప్రస్తుతం బాలీవుడ్ కళ్లన్నీ అల్లు అర్జున్ రాకపైనే ఉన్నాయి. పుష్ప 1తో బాలీవుడ్ షేక్ అయిన విషయం తెలిసిందే. మరి పుష్ప 2 ఇంకెంత షేక్ చేస్తుందో చూడాలి. ఇక తెలుగు రాష్ట్రాల ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నవంబర్ 30న చిత్తూరులో భారీ ఎత్తున మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కోసం తెలుగు ఫాన్స్ ఎదురుచుస్తున్నారు.
Mumbai meri jaan, aa raha hain Indian Cinema ki shaan 🔥🔥#PushpaIconicPressMeet in Mumbai tomorrow from 2 PM onwards at JW Marriott Sahar ❤️🔥
▶️ https://t.co/Pk4R18O17V#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5th
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/4gzZTnQ74e
— Pushpa (@PushpaMovie) November 28, 2024