ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ను ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేసింది పుష్ప సినిమా.తెలుగు ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా సుకుమార్ కు మంచి పేరు ఉంది..ఈ క్రియేటివ్ డైరెక్టర్ తెరకెక్కించిన పుష్ప భారీ విజయాన్ని నమోదు చేసింది.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్, డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో ఎప్పుడూ కనిపించనంత మాస్ పాత్రలో కనిపించి మెప్పించాడు అల్లు అర్జున్. అలాగే చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులు మాత్రం ప్రేక్షకులకు తెగ నచ్చేసాయి.పాన్ ఇండియా మూవీగా విడుదల అయిన పుష్ప సినిమా కు రాక్ స్టార్ దేవీశ్రీ అందించిన సంగీతం ఎంతో ప్లస్ అయిందని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సాంగ్స్ తెగ సందడి చేశాయి. ఇప్పటికి కూడా ఆ పాటల క్రేజ్ అస్సలు తగ్గలేదు.
ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాను ను తెరకెక్కిస్తూ ఉన్నారు సుకుమార్. మొదటి భాగం కంటే ఈ భాగం లో ఎక్కువగా యాక్షన్ సీన్స్ ఉండేలా కథను సిద్ధం చేశారట సుకుమార్. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా స్పీడ్ గా జరుగుతోంది. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ నుంచి ఓ వీడియో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది.ఇదిలా ఉంటే పుష్ప 2లో లోని ఇంట్రెవెల్ సీన్ లో ఊహించని ట్విస్ట్ ఉంటుందని సమాచారం.ఆ ట్విస్ట్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని సమాచారం.. సినిమా మొత్తం లో ఆ ఒక్క సీన్ మాత్రం నెక్స్ట్ లెవల్ లో ఉండనుందట. సినిమా మొత్తానికి ఆ సీన్ హైలైట్ గా నిలువనుందని సమాచారం.అలాగే హీరోయిన్ రష్మిక మందన్న పాత్ర కూడా ఈ సినిమాలో ఎంతో కీలకం గా ఉండనుందని సమాచారం.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ను దాదాపు 400కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.మరీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏ రేంజ్ లో రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.